బర్డ్ ఫ్లూ భయం.. చికెన్, కోడిగుడ్డు బదులు ఈ ఫుడ్స్ తీసుకుంటే..

First Published Jan 18, 2021, 11:18 AM IST

 చికెన్, కోడిగుడ్డు లేకున్నా.. వాటి బదులు కొన్ని ఆహారాలు తీసుకుంటే సరిపోను ప్రోటీన్స్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా...

ప్రస్తుతం దేశంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. మొన్నటి వరకు కరోనా భయంతో వణికిపోయారు. ఇప్పుడు దానికి వ్యాక్సిన్ రాగానే.. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోంది. దీంతో.. చికెన్, కోడిగుడ్డు తినాలంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కరోనా సమయంలో.. రోగ నిరోధక శక్తి కోసం ఏ చికెన్, గుడ్డు అయితే.. తిన్నామో.. ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ కారణంగా.. వాటినే తినకుండా పోయే పరిస్థితి ఎదురైంది.
undefined
అయితే.. చికెన్, కోడిగుడ్డు లేకున్నా.. వాటి బదులు కొన్ని ఆహారాలు తీసుకుంటే సరిపోను ప్రోటీన్స్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా...
undefined
1.సోయాబీన్స్.. చికెన్, కోడిగుడ్డు తింటే మీకు ఎన్ని పోట్రీన్స్ లభిస్తాయో.. అవే ప్రోటీన్స్ సోయా బీన్స్ తినడం వల్ల లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల సోయాబీన్స్ లో 36 గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి. మీ ఆరోగ్యానికి మంచి చేయడంతోపాటు.. అన్ని ప్రోటీన్స్ సోయా బీన్స్ ద్వారా లభిస్తాయి.
undefined
2.పన్నీర్... వెజిటేరియన్స్ కి బెస్ట్ ప్రోటీన్ పన్నీర్ నుంచి లభిస్తుంది. గుడ్డు, చికెన్ కి బదులు దీనిని పుష్కలంగా తీసుకోవచ్చు.
undefined
3.పల్లీలు.. పీనట్స్, నట్స్ కూడా ప్రోటీన్స్ కి బెస్ట్ సోర్స్. వీటిని ప్రతిరోజూ తీసుకుంటే.. మనకు కావాల్సిన ప్రోటీన్స్ లభిస్తాయి.
undefined
4.కినోవా.. కినోవా అనేది ఒకరకమైన చిరు ధాన్యం. ఈ మధ్యకాలంలో చాలా మంది దీనిని ఆహారంగా తీసుకుంటున్నారు. దీనిలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
undefined
5.నట్స్ అండ్ సీడ్స్... బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్ లో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
undefined
click me!