సపోటాలోని ఆరోగ్యప్రయోజనాలు.. ఎన్ని రకాలుగా మేలు చేస్తుందో తెలుసా?

First Published | Jul 5, 2021, 3:04 PM IST

సపోటాను చికూ, సపోడిల్లా అని కూడా పిలుస్తారు. ఇది శీతాకాలపు పండు. చూడడానికి పెద్దగా ఆకర్షణీయంగా లేకపోయినా.. అద్భుతమైన రుచితో మనసును కొల్లగొడుతుంది. అరటి, మామిడిలాగే దీంట్లోని గుజ్జు త్వరగా జీర్ణమవుతుంది. 

సపోటాను చికూ, సపోడిల్లా అని కూడా పిలుస్తారు. ఇది శీతాకాలపు పండు. చూడడానికి పెద్దగా ఆకర్షణీయంగా లేకపోయినా.. అద్భుతమైన రుచితో మనసును కొల్లగొడుతుంది. అరటి, మామిడిలాగే దీంట్లోని గుజ్జు త్వరగా జీర్ణమవుతుంది.
undefined
మనదేశంలో సపోటా ఎక్కువగా కర్ణాటకలో పండుతుంది. దీన్ని పండుగా, మిల్క్ షేక్ లా, రకరకాల డెజర్ట్స్ లో వేసి.. ఇలా అనేక రకాలుగా రుచిని ఆస్వాదిస్తారు. అయితే దీని ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే మాత్రం దీన్ని వదిలిపెట్టరు.
undefined

Latest Videos


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సపోటాలో ఉండే సహజసిద్ధమైన టానిన్లు, పేగుల్లో ఆమ్లాలు ఊరడాన్ని తటస్థీకరిస్తుంది. సపోటాలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇతర జీర్ణ సమస్యలను నియంత్రిస్తుంది. సపోటాలో శక్తివంతమైన యాంటీవైరల్, యాంటీపరాసిటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి పొట్టలోని పుండ్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయి.
undefined
ఎముకలను దృఢంగా చేస్తుంది. సపోటాలో రాగి, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, సెలీనియం, ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కీళ్ల నొప్పులను కూడా నివారిస్తుంది.
undefined
కణజాలాన్ని కలిపి ఉంచడానికి, ఎముకల ఆరోగ్యగానికి సపోటాలో ఎక్కువ మోతాదులో ఉండే రాగి చాలా ఉపయోగపడుతుంది. రాగి లోపం వల్ల బోలు ఎముకల వ్యాధి వస్తుంది. దీనివల్ల ఎముకలు పెళుసుగా, బలహీనంగా మారతాయి.
undefined
మీకు ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే, మీ ఆహారంలో సపోటాను చేర్చాలి. ఎందుకంటే సపోటాలో చర్మానికి అనుకూలమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సపోటా చర్మంలోని తేమను లాక్ చేస్తుంది. దీంట్లో ఎ, బి, సి వంటి విటమిన్లు ఉండటం వల్ల కొత్త చర్మ కణాలను పునరుద్ధరిస్తుంది. ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతీసే హానికరమైన టాక్సిన్స్ను నిరోధిస్తాయి. చర్మం రంగును పెంచుతుంది. వృద్ధాప్యాన్ని అరికడుతుంది.
undefined
కంటి చూపును మెరుగుపరిచి, బిపిని నియంత్రిస్తుంది. సపోటాలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పొటాషియం ఒక ఖనిజం, ఇది శరీరంలో సోడియం స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
undefined
అలాగే, సపోటాలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చుట్టూ ఉన్న పొరల మీద పనిచేసిచూపును మెరుగుపరుస్తుంది. కార్నియా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
undefined
సపోటాను ఎన్ని రకాలుగా తినొచ్చంటే..ముందుగా సపోటాను నల్లా కింద నీళ్లలో బాగా కడగాలి. ఆ తరువాత రెండు ముక్కలుగా కోసి, గింజలు తీసేసి గుజ్జును తినేయడమే. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే అద్భుతమైన రుచి దీని సొంతం. అందుకే దీన్ని స్మూతీస్, సలాడ్లలో ఎక్కువగా వాడతారు.
undefined
నట్టీ చిక్కూ మిల్క్‌షేక్ రెసిపీ చూడండి..జీడిపప్పు, చక్కెర, పాలను బ్లెండర్లో మెత్తగా చేసి, దీనికి సపోటా గుజ్జు కలిపి మరోసారి బ్లెండ్ చేయాలి. దీన్ని గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ వేసి.. కాజు, బాదం ముక్కలతో అలంకరించడమే..
undefined
సపోటాను ఎలా ఎంచుకోవాలి. అంటే... చూడగానే ఫ్రెష్గా అనిపించాలి.. బయటి చర్మం తాజాగా ఉండాలి. ఒత్తి చూస్తే మరీ గట్టిగా కాకుండా.. మరీ మెత్తగా కాకుండా ఉండాలి. పండు మీద ఎలాంటి గాయాలూ ఉండకూడదు.
undefined
సపోటా కాయలైతే గది ఉష్ణోగ్రత వద్ద 7-10 రోజులు నిల్వ చేయచ్చు. పండినవైతే కొన్ని రోజులు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు.ఏదైనా అతిగా తింటే ప్రమాదమే.. ఇది సపోటాకూ వర్తిస్తుంది. మంచిది కదా అని తెగ తినేస్తే గ్యాస్ట్రో ఇంటస్టెయిన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కంట్రోల్ లోనే తినాలి.
undefined
click me!