చిటికెడు వాము.. ఎన్ని ప్రయోజనాలో..!

First Published | Jul 1, 2021, 11:09 AM IST

తరచూ కడుపులో నొప్పితో బాధపడేవారు.. వీటిని తినడం వల్ల ఆ సమస్య నుంచి వెంటనే బయటపడగలుగుతారు. 

మనకు ఒంట్లో బాగోలేదు అనుకోండి.. వెంటనే దగ్గర్లోని మెడికల్ షాప్ కి పరిగెత్తి.. ఏవేవో మందులు కొని వాడేస్తూ ఉంటాం. కానీ.. నిజానికి మన వంటింటిని మించిన ఔషదాలయం మరేదీ లేదు. ఆ ఇంగ్లీష్ మందులకు బదులు.. వంటింట్లో లభించే కొన్ని పదార్థాలు.. మనకు పూర్తి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
వాటిల్లో వాము కూడా ఒకటి. దీనినే హిందీలో అజ్వైన్ అని పిలుస్తారు. సువాసనలు వెద జల్లే.. ఈవాము నోట్లో వేసుకుంటే.. కొద్దిగా మంటగా ఉంటుంది. కానీ.. దీనిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ వాము తినడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం..

జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి వాము ఎంతగానో సహాయం చేస్తుంది. అల్సర్ సమస్యలతో బాధపడేవారు.. తరచూ వామును తీసుకోవాలి. ఇది పుండ్లను తగ్గించి.. ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజూ అర స్పూన్ వాము తినడం వల్ల లేదా.. పొడి చేసి నీటిలో కలిపి తాగడం వల్ల.. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.
తరచూ కడుపులో నొప్పితో బాధపడేవారు.. వీటిని తినడం వల్ల ఆ సమస్య నుంచి వెంటనే బయటపడగలుగుతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు.. అజీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారు ప్రతిరోజూ వాము నీరు తాగడం మంచిది. వాముని కొద్దిగే వేయించి.. ఆతర్వాత నీటిలో ఉడకపెట్టి.. ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల జీర్ణ క్రియలో తలెత్తే సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.
ఈ వాములో థైమాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి కూడా సహాయం చేస్తుంది. చర్మంపై దురద లేదా.. దద్దుర్లు వస్తుంటే.. ఆ ప్రాంతంలో.. వాము ని నూరి ఆ చూర్ణాన్ని ఆ ప్రాంతంలో రాయాలి. ఇలా రాయడం వల్ల ఆ సమస్య తగ్గుమఖం పడుతుంది.
ఇక జుట్టు విపరీతంగా రాలిపోతున్నట్లయితే... వారు రాత్రిపూట స్పూన్ వాముని నీటిలో నానపెట్టి.. మరసటి రోజు పరగడుపున ఈ నీటిని తాగాలి. ఇలా తరచూ తాగడం వల్ల జుట్టురాలే సమస్య నుంచి బయటపడతారు.
ఈ వాములో కొద్దిగా వేడి చేసిన నెయ్యి కలిపి తీసుకుంటే.. శరీరంలో ని కొవ్వను తగ్గించడానికి సహాయం చేస్తుంది. అధిక బరువు తగ్గించేందుకు కూడా సహాయం చేస్తుంది.

Latest Videos

click me!