మీకు పోహా ఇష్టమా.. కూరగాయలు, వేయించిన పల్లీలు, ఉల్లిపాయముక్కలతో టేస్ట్ అదిరిపోయే పోహాను టిపిన్ గా తింటే ఆహా.. అంటారు. అయితే మీరు తీపి ప్రియులైతే.. ఇదే పోహాను వెరైటీగా తయారుచేసుకోవచ్చు.
ఇది చిటికెలో తయారవుతుంది.. మీకు ఓ అద్భుతమైన రుచిని ఇస్తుంది. దీన్ని డెజర్ట్ లాగా కూడా తినొచ్చు. కొబ్బరి, బెల్లంతో తయారు చేసే ఈ ఫ్యూజన్ మహారాష్ట్ర రెసిపీని ఒక్కసారి తింటే.. వదిలిపెట్టరు. పిల్లలు పెద్దలూ అందరూ ఇష్టపడతారు.
కొబ్బరి బెల్లం పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు1 కప్పు నానబెట్టిన అటుకులు14 కప్పు బెల్లం పొడి1 గ్రాము ఉప్పు3 టేబుల్ స్పూన్ల తురిమిన కొబ్బరి8 వేయించిన జీడిపప్పులు1 టేబుల్ స్పూన్ నెయ్యి
కొబ్బరి బెల్లం పోహా తయారు చేసే విధానం.ముందుగా అటుకులను ఓ బౌల్ లో తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి 34 కప్పుల నీళ్లు పోసి కాసేపు నానబెట్టండి.
పోహా నానిన తరువాత నీటిని పూర్తిగా వంపేసి.. దీనికి తురిమిన కొబ్బరిని కలపండి.
తరువాత ఈ మిశ్రమానికి బెల్లం పొడి, చిటికెడు ఉప్పు, నెయ్యి కలపండి. ఇవి పూర్తిగా ఒకదానికొకటి కలిసేలా బాగా కలపండి.
తరువాత దీని మీద కాజు అలంకరించి సర్వ్ చేయడమే..