శ్రీ కృష్ణుడికి ఇష్టమైన తెల్ల వెన్నను రోజూ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో

First Published | Sep 6, 2023, 11:33 AM IST

మార్కెట్ లో దొరికే ప్రిజర్వేటివ్స్, సాల్ట్, కొత్త ఫ్లేవర్డ్ బటర్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. కానీ దీన్ని మీరు మంచి పద్దతిలో తయారుచేసి తింటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 
 

చాలా మంది తెల్ల వెన్నను తినడానికి అస్సలు ఇష్టపడరు. నిజానికి ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్లో లభించే ప్రిజర్వేటివ్స్, ఉప్పు, కొత్త రుచిగల వెన్న మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ స్వచ్ఛమైన వెన్నను తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు ఇది మీ చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఈ జన్మాష్టమికి మీ ఆహారంలో శ్రీకృష్ణుడి అత్యంత ప్రత్యేకమైన, ఇష్టమైన తెల్ల వెన్నను ఎందుకు చేర్చకూడదు చెప్పండి. నిజానికి ఈ వెన్నను  తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

వైట్ బటర్ లో ఉండే పోషకాలు

వైట్ బటర్ లో కాల్షియం, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటుగా పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే విటమిన్ -డి, ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా వైట్ బటర్ లో లభిస్తాయి. ఇంట్లో తయారుచేసిన తెల్ల వెన్నను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 


బరువు తగ్గడానికి సహాయపడుతుంది

సాధారణంగా వెన్నలో కొవ్వు ఉండటం వల్ల చాలా మంది దీనికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా దీన్ని తింటే బరువు పెరుగుతారనే భయంతో పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఇలా చేయడం మీరు చేసిన అతి పెద్ద తప్పు. అవును  మీ బరువు తగ్గించే ప్రయాణానికి ప్రోటీన్ ఎంత ముఖ్యమో ఆరోగ్యకరమైన కొవ్వు కూడా అంతే ముఖ్యం. తెల్ల వెన్నలో లెసిథిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక రకమైన కొవ్వు. ఇది జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఆరోగ్యంగా, సమతుల్యంగా ఉండటానికి జీవక్రియ చాలా ముఖ్యం.

ఎముకలను బలంగా చేస్తాయి

తెల్ల వెన్న మీ కీళ్లను సహజంగా లూబ్రికేషన్ చేస్తుంది. దీనితో పాటుగా దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే తెల్ల వెన్నను కీళ్ల నొప్పులకు పురాతన చికిత్సగా పరిగణించబడుతుంది. మీరు కూడా దీనితో బాధపడుతుంటే ప్రతిరోజూ మీ ఆహారంలో ఒక టేబుల్ స్పూన్ ఇంట్లో తయారుచేసిన తెల్ల వెన్నను జోడించండి.
 

 కొవ్వులో కరిగే విటమిన్లు 

చాలా మంది వెన్నను ఫ్యాట్ ఫుడ్ గా భావిస్తారు. అయితే ఇందులో ఉన్న కొవ్వు మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. వెన్నలో విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ కె 2 తో పాటుగా కొవ్వులో కరిగే విటమిన్లు చాలా ఉంటాయి. విటమిన్ ఇ, విటమిన్ ఎ ను భర్తీ చేయడానికి చాలా మందికి కూరగాయలు, పండ్లతో పాటు ఇతర ఆహారాలు అవసరం. కానీ విటమిన్ కె 2 ను పొందడం కొంచెం కష్టం. విటమిన్ కె 2 చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కాబట్టి తెల్ల వెన్న తీసుకోవడం చాలా ముఖ్యం.

ఆరోగ్యకరమైన సంతృప్త కొవ్వు

వెన్నలో తగినంత మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సంతృప్త కొవ్వును తీసుకోవడం, గుండె జబ్బుల మధ్య ఎలాంటి సంబంధం లేదని అనేక అధ్యయనాలు చూపించాయి. సంతృప్త కొవ్వు  మన "మంచి" హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అలాగే "చెడు" ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అవి ఇతర కొవ్వుల కంటే భిన్నంగా జీవక్రియ చేయబడతాయి అలాగే ఫ్యాట్ ను బర్న్ చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి.

చర్మానికి నేచురల్ గ్లో

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే వైట్ బటర్ మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే వెన్నలో ఉండే విటమిన్ ఎ, ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని తేమగా మార్చి మృదువుగా మెరిసేలా చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ చర్మం నేచురల్ గ్లో గా మెరిసిపోతుంది. అంతేకాదు ఇది మీ చర్మంపై ఒక్క మచ్చలేకుండా చేస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

తెల్ల వెన్నలో ఉండే సంతృప్త కొవ్వులు.. విటమిన్ ఎ, విటమిన్ డి లను నిర్వహించడానికి సహాయపడతాయి. అలాగే మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది అంటువ్యాధులు, ఇతర సమస్యలతో పోరాడటానికి మీ శరీరాన్ని సిద్ధంగా ఉంచుతుంది.

Latest Videos

click me!