వీళ్లు రాత్రిపూట పాలు తాగొద్దా?

First Published | Sep 3, 2024, 4:12 PM IST

రాత్రిపూట గోరువెచ్చని పాలను తాగితే బాగా నిద్రపడుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇది బరువు పెరిగేలా కూడా చేస్తుందని నిపుణులు అంటున్నారు.బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట పాలను తాగకపోవడమే మంచిదంటున్నారు. 

రాత్రి పూట వేడి పాలను తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ అలవాటు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రాత్రిపూట నిద్రపోవడానికి ముందు పాలను తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి.

పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, దీనికి నిద్రను ప్రేరేపించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నిద్రపోయేలా చేసే మెలటోనిన్, సెరోటోనిన్ అనే రెండు ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్ల సంశ్లేషణకు ట్రిప్టోఫాన్ చాలా అవసరం.

మెలటోనిన్ ను  'స్లీప్ హార్మోన్' అని కూడా పిలుస్తారు. ఇది నిద్రపోయే-మేల్కొనే చక్రాన్ని నియంత్రిస్తుంది. ఇది రాత్రిపూట మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 

అలాగే సెరోటోనిన్ ఒక బహుముఖ న్యూరోట్రాన్స్మిటర్‌గా పనిచేస్తుంది. ఇది మానసిక స్థితిని నియంత్రించడానికి మాత్రమే కాకుండా ఆకలిని నియంత్రించడానికి, నిద్ర మాడ్యులేషన్, నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

అంతేకాదు ఇది ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. ప్రశాంతమైన రాత్రి విశ్రాంతి కోసం మిమ్మల్ని సున్నితంగా చేయడానికి ఇది పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


BMC జెరియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల వృద్ధులకు బాగా నిద్రపడుతుంది. నిద్రపై పాల సానుకూల ప్రభావాన్ని ఇతర అధ్యయనాలు కూడా కనుగొన్నాయి.

అలాగే ఇది ప్రశాంతమైన రాత్రి నిద్రకు కూడా బాగా సహాయపడుతుంది. గోరు వెచ్చని పాలను రాత్రిపూట తాగడం వల్ల మీరు బాగా నిద్రపోతారు. అయితే నిద్రపోవడానికి ముందు పాలను తీసుకునే సమయం,  పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు.. వ్యక్తుల ఆరోగ్యం, తీసుకున్న ఆహారాలు, మొత్తం ఆరోగ్య స్థితి వంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

నిద్రవేళకు ముందు పాలు

రాత్రిపూట పాలు తాగితే బరువు పెరుగుతారా?

మీరు ప్రశాంతంగా నిద్ర పోవాలనుకుంటే మాత్రం రాత్రి పూట పాలను తాగడం మంచిది. కానీ బరువు తగ్గాలనుకునే  వారు మాత్రం పాలకు దూరంగా ఉండటమే మంచిది. ఎదుకంటే రాత్రి పూట పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కాలేయ పనితీరును ప్రభావితం అవుతుంది.

ఈ ప్రక్రియ మీ శరీర జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. ఇది మీ శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి, మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది.

 మీరు ప్రతిరోజూ వేడి పాలను రాత్రిపడుకునే ముందు తాగితే మీరోజువారి కేలరీల వినియోగం బాగా పెరుగుతుంది. ఇది మీరు బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

రాత్రి పూట పాలను తాగడం వల్ల పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు మీ శీరంరలో ఇన్సులిన్ విడుదలను పెంచుతాయి. ఇది మీ శరీర సర్కేడియన్ లయను కూడా దెబ్బతీస్తుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఏదైనా సమస్యను తగ్గించాలనుకుంటే మీరు పాలను లిమిట్ లోనే తాగాలి. హార్మోన్ల మార్పులకు గురయ్యే వ్యక్తులు కూడా పాలను లిమిట్ లోనే తాగాలి. 

నిద్రవేళకు ముందు పాలు

రాత్రి పూట పాలు తాగడం వల్ల మహిళలకు హానికరమా?

సాధారణంగా మహిళలు ఏదైనా హార్మోన్ల మార్పులకు గురవుతుంటే.. రాత్రి పూట పాలు తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. పాలను ఎక్కువగా తాగడం వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది.  మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి,

ముఖ్యంగా PCOS లేదా PCOD ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎన్నో అధ్యయనాలు పాలలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్‌తో సహా ఎన్నో హార్మోన్లు తక్కువ మొత్తంలో కలిగి ఉన్నాయని కనుగొన్నాయి. 

రాత్రి పూట పాలు తాగడం వల్ల బాగా నిద్ర వస్తుంది. ట్రిప్టోఫాన్, మెలటోనిన్, సెరోటోనిన్ ఉత్పత్తి శక్తిని ఉపయోగించుకుంటూ.. రాత్రి పూట పాలు తాగడం వల్ల ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం రాత్రిపూట పాలను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అయితే రాత్రి పూట పాలు తాగడం మీకు మంచిదా కాదా అని నిర్ణయించుకోవడానికి మీ డార్టక్ ను సంప్రదించడం మంచిది. 

Latest Videos

click me!