ఈ జ్యూస్ నెలరోజులు తాగితే, ఎంత పొట్టైనా కరిగిపోవాల్సిందే..!

Published : Nov 02, 2024, 10:17 AM IST

  నెల రోజులు ఒక డ్రింక్ తాగడం వల్ల.. ఈజీగా బెల్లీ ఫ్యాట్ ని కరిగించవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం…  

PREV
14
 ఈ జ్యూస్ నెలరోజులు తాగితే, ఎంత పొట్టైనా కరిగిపోవాల్సిందే..!
belly fat

 

ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు అని చెప్పొచ్చు. బరువు కంటే ఎక్కువగా.. బెల్లీ ఫ్యాట్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. చాలా మంది చెప్పేది ఏంటంటే.. తాము కష్టపడితే బరువు అయినా తగ్గుతున్నాం కానీ.. ఆ పొట్ట మాత్రం కరగడం లేదు అని వాపోతూ ఉంటారు. కానీ.. నెల రోజులు ఒక డ్రింక్ తాగడం వల్ల.. ఈజీగా బెల్లీ ఫ్యాట్ ని కరిగించవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం…

 

24

 

అది మరేంటో కాదు..కీరదోస కాయ. మీరు చదివింది అక్షరాలా నిజం. ఈ నెల రోజులు మీరు కనుక కీరదోస కాయ జ్యూస్ తాగితే బరువు మాత్రమే కాదు.. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది. మరి.. ఈ కీరదోస జ్యూస్ ని ఎలా తయారు చేయాలో  తెలుసుకుందాం

 

అర కీరదోసకాయ, అర అంగుళం అల్లం, కొన్ని పుదీనా ఆకులు, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ సబ్జా గింజలు, కొద్దిగా కొత్తిమీర, దాల్చిన చెక్క పొడి, బంతిపువ్వు గింజల పొడి. 200 ఎంఎల్ వాటర్. వీటన్నింటితో కలిపి ఈ జ్యూస్ తయారు చేయాలి.

 

34

 

సబ్జా గింజలు మినహాయించి… మిగిలిన అన్నింటినీ బ్లెండర్ లో వేసి  జ్యూస్ గా తయారు చేయాలి. ఇప్పుడు గ్లాసులో అడుగున సబ్జా గింజలు వేసి… వాటిపైన ఈ జ్యూస్ కలిపాలి. అంతే జ్యూస్ తయారైనట్లే. ఈ జ్యూస్ ని మీరు ఉదయాన్నే తాగితే సరిపోతుంది.

 

కీరదోస మన శరీరంలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని ఆపుతుంది. దీని ద్వారా సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నెమ్మదిగా పొట్టలో ఫ్యాట్ కూడా కరుగుతుంది.

 

44

 

ఇక కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపించడంలో సహాయం చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ కరిగించడంలోనూ సహాయపడుతుంది.

 

అంతే, ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా నెల రోజులపాటు తాగాలి. అయితే.. ఈ జ్యూస్ తాగడంతో పాటు.. రెగ్యులర్ గా మినిమమ్ వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఫలితం లభిస్తుంది.


 

Read more Photos on
click me!

Recommended Stories