రాత్రిపూట ఏ పండ్లను తినకూడదో తెలుసా?

First Published Jun 25, 2024, 3:06 PM IST

పండ్లలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని రకాల పండ్లను రాత్రిపూట అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ టైంలో పండ్లను తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. ఇంతకీ రాత్రిపూట ఎలాంటి పండ్లను తినకూడదంటే?
 


అరటి

అరటిపండును తినడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండును తింటే తక్షణ ఎనర్జీ అందుతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. డయాబెటీస్ పేషెంట్లకు కూడా మంచి మేలు చేస్తుంది. కానీ ఈ పండును మాత్రం రాత్రి పడుకునే ముందు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇలా పడుకునే ముందు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

mango

మామిడి పండు

మామిడి పండ్లు ఎంత టేస్టీగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండులో మన శరీరానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. కానీ వీటిలో నేచురల్ షుగర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. 
 

ద్రాక్షపండ్లు

ద్రాక్ష పండ్లలో వాటర్ కంటెంట్ తో పాటుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఈ పండును పడుకునే ముందు మాత్రం తినకూడదు. ఎందుకంటే ఈ పండును తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయి. అందుకే ద్రాక్షలకు బదులుగా మీరు రాత్రిపూట బెర్రీలు వంటి తక్కువ షుగర్ లెవెల్స్ ఉన్న పండ్లను తినొచ్చు. 

is-it-normal-to-only-have-a-period-for-1-day

పైనాపిల్

పైనాపిల్ లో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పండు విటమిన్ సి కి గొప్ప మూలం. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. కానీ ఈ పండును రాత్రిపూట మాత్రం తినకూడదు. ఎందుకంటే ఈ పండులో కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. 

Latest Videos

click me!