ఓట్స్ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? ఎలా తినాలి..?

First Published | Jun 25, 2024, 2:00 PM IST

ఓట్స్ తింటే చాలు... ఈజీగా నెలకు నాలుగు నుంచి ఐదు కేజీలు తగ్గుతారు అని నమ్మేస్తున్నారు. ఇందులో నిజం ఎంత..? ఓట్స్ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...
 

ఏదో  ఒక సమయంలో మనం అధిక బరువు పెరిగిపోతూ ఉంటాం. సరైన లైఫ్ స్టైల్  ఫాలో కాకపోవడం, జంక్ ఫుడ్ తినడం లాంటి కారణాలు, అధికంగా తినడం వల్ల కూడా బరువు పెరుగిపోతూ ఉంటాం. ఇలా పెరిగిపోయిన బరువు తగ్గించడానికి ఎవరికి వారు ఏ ప్రయత్నాలు పడితే  ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక.. ఈ మధ్యకాలంలో  బరువు తగ్గాలి అంటే అందరూ ఓట్స్ ని ఎంచుకుంటున్నారు. ఓట్స్ తింటే చాలు... ఈజీగా నెలకు నాలుగు నుంచి ఐదు కేజీలు తగ్గుతారు అని నమ్మేస్తున్నారు. ఇందులో నిజం ఎంత..? ఓట్స్ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...

ఓట్స్ ఎందుకు ఆరోగ్యకరం..?

ఓట్స్  ఈ మధ్య కనిపెట్టిన ఫుడ్ ఏమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్న తృణధాన్యాల్లో ఓట్స్ ఒకటి.  మన శరీరానికి అవసరమైన వివిధ రకాల చాలా పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు.. మనకు అవసరం అయిన ప్రోటీన్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. బీటా -గ్లూకాన్ అని పిలువపడే ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. అందుకే దీనిని ఆరోగ్యకరమైన ఫుడ్ గా చెబుతారు.


ఓట్స్ లో ఉండే ఫైబర్ మనకు ఈజీగా  కొలిస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది. పేగు ఆరోగ్యాన్ని కూడా సహాయపడుతుంది.  శరీరంలో గ్లూకోజ్ శోషణను కూడా తగ్గించడంలో సహాయం చేస్తాయి.  అవెనాంత్రమైడ్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు నైట్రిక్ ఆక్సైడ్ వాయువును ఉత్పత్తి చేయడం ద్వారా అధిక రక్తపోటు స్థాయిలను అణిచివేసేందుకు సహాయపడతాయి. 
.

ఓట్స్ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది...?


ఓట్స్‌లోని గొప్ప పోషక పదార్ధాలను తిరస్కరించలేము, అయితే ఈ పదార్ధం అధిక పిండిపదార్థాలతో మిమ్మల్ని ప్యాక్ చేస్తుంది. కార్బ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఓట్స్ తినే సమయంలో చాలా జాగ్రత్తపడాలి. లేకపోతే.. ఇన్సులిన్ స్పైక్ అయ్యి... డయాబెటిక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓట్స్ ని మనం తీసుకునే విధానాన్ని పట్టి.. అది మంచిదా చెడ్డదా అని చెప్పొచ్చు అని నిపుణులు అంటున్నారు.  ఇరు ఇన్ స్టాంట్ ఓట్స్ తినకూడదు. దీనిలో   గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు.. పండ్లను కూడా కలుపుతాం. రెండింటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి.. బరువు పెరగడానికీ, అదేవిధంగా షుగర్ క్రాష్ కి కారణం అవుతుంది. దీని వల్ల మనకు కడుపు నిండిన అనుభూతి రాదు. షుగర్ క్రేవింగ్స్ వస్తాయి. అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. మీ బరువు తగ్గించే విధానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 

బరువు తగ్గడానికి ఓట్స్ తీసుకోవడానికి సరైన మార్గం ఏమిటి? 

వోట్స్ లో  అధిక గ్లైసెమిక్  ఉంటాయి కాబట్టి... తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ,ఫైబర్‌లో మితమైన ఆహారాలను దానితో కలిపి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల  భోజనాన్ని మధుమేహానికి అనుకూలమైనదిగా చేస్తుంది, బరువు తగ్గడానికి మరింత సహాయపడుతుంది.బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడానికి మీకు అవసరమైన నెమ్మదిగా , స్థిరమైన శక్తిని అందిస్తుంది. అందుకే..  ఇన్ స్టాంట్ ఓట్స్ కాకుండా రోల్డ్  ఓట్స్ ఎంచుకోవాలి. వాటి వల్ల.. మనకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
 

Latest Videos

click me!