మిగిలిపోయిన ఇడ్లీలతో ఎలాంటి వంటకం చేయొచ్చో తెలుసా?

First Published | Jun 25, 2024, 2:47 PM IST

చాలా సార్లు ఇడ్లీలు బాగా మిగిలిపోతుంటాయి. వీటితో ఏం చేయాలో తెలియక డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు చాలా మంది. కానీ ఈ మిగిలిపోయిన ఇడ్లీలతో కూడా మీరు టేస్టీ టేస్టీ టిఫిన్ ను తయారుచేయొచ్చు. అదేంటంటే?

చాలా మంది మిగిలిపోయిన ఇడ్లీలను తినలేక డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ మీరు వీటితో కూడా మంచి బ్రేక్ ఫాస్ట్ ను రెడీ చేయొచ్చు. సాధారణంగా మిగిలిపోయిన ఇడ్లీలతో చాలా మంది ఉప్మానే చేస్తుంటారు. కానీ పదే పదే ఉప్మా తినాలంటే బోర్ వస్తుంది. అందుకే మిగిలిపోయిన ఇడ్లీలతో మసాలా ఇడ్లీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.. ఈ మసాలా ఇడ్లీలను పెద్దలతో పాటుగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 

మసాలా ఇడ్లీని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు

ఉల్లిపాయలు - 1 (సన్నగా తరిగినవి), క్యాప్సికమ్ - 1 (సన్నగా తరిగినవి),అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, పచ్చిమిర్చి - 4 (సన్నగా తరిగినవి), టమాటా - 1 (సన్నగా తరిగినవి), పసుపు - 1/2 టీస్పూన్,కారం - 1/2 టీస్పూన్, పావ్ బాజీ మసాలా - 1/2 టీస్పూన్, నిమ్మరసం - 1/2 టీస్పూన్, కొత్తిమీర - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - తగినంత
 

Latest Videos


తయారుచేసే విధానం:

మిగిలిపోయిన ఇడ్లీలను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి బాణలిలో నూనె వేడిచేయండి. దీనిలో తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసి వేయించండి. దీనిలో కొద్దిగా ఉప్పు వేయండి.  ఉల్లిపాయ రంగు మారగానే తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి.

ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత తరిగిన టమాటాలు వేయండి. టమాటాలు మెత్తబడిన తర్వాత నీళ్లు, ఉప్పు, కారం, పసుపు, పావ్ బాజీ మసాలా వేసి బాగా కలపండి. చివరగా ఇడ్లీ ముక్కలు వేసి మసాలాలు ఇడ్లీకి బాగా అంటుకునే వరకు కలుపుతూ ఉండండి. చివరగా నిమ్మరసం చల్లి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేయండి. అంతే మసాలా ఇడ్లీ రెడీ. ఈ రెసిపీని వేడి వేడిగా తింటే టేస్ట్ అదురుతుంది.

click me!