నెయ్యి ఎంతకాలం నిల్వ ఉంటుంది..?

First Published | Nov 4, 2024, 4:03 PM IST

నెయ్యి ని ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. ప్రతి ఇంట్లోనూ నెయ్యి  ఉంటుంది. మరి.. ఒక్కసారి కొన్న నెయ్యిని ఎంతకాలం వాడొచ్చు..? నెయ్యి ఎంత కాలం స్వచ్ఛంగా ఉంటుంది? అసలు నెయ్యికి  ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

నెయ్యి ని శతాబ్దాలుగా భారతీయ వంటకాల్లో ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. నెయ్యి వంటకు రుచిని అందించడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనల్ని యవ్వనంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. శరీరానికి పోషణను అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కూడా నెయ్యి చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

నెయ్యి దాని రుచి, కమ్మని వాసనకు ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా భారతీయ వంటకాల్లో కూరగాయలు, రొట్టెలు, పప్పులు, బిర్యానీలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దీనితో పాటు స్వీట్లు తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నెయ్యి ప్రధానంగా సంతృప్త కొవ్వులతో తయారు చేశారు. మరి, నెయ్యికి ఎక్స్ ఫైరీ డేట్  ఉంటుందా? ఎంతకాలం నిల్వ చేయగలం? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..


నెయ్యి గడువు ముగుస్తుందా?

నెయ్యి గడువు ముగుస్తుందా లేదా పాడవుతుందా అనే సందేహం మీకు ఉందా? దీనికి సమాధానం అవును. ఇతర వస్తువుల మాదిరిగానే నెయ్యి కూడా పాడయ్యే అవకాశం ఉంది. మీరు దుకాణాల్లో నెయ్యి కొనుగోలు చేసినప్పుడు నెయ్యిపై ఎక్స్ పైరీ డేట్   వ్రాసి ఉండటం మీరు చూసి ఉంటారు. ఎప్పటి వరకు దానిని ఉపయోగించాలో దాని మీద పేర్కొని ఉంటుంది. దానిని చూసి ఫాలో అవ్వాలి.

నెయ్యి పాడైపోయిందని సూచించే కొన్ని సంకేతాలు:

దుర్వాసన - నెయ్యి నుండి దుర్వాసన లేదా పుల్లని వాసన వస్తే అది పాడైపోయిందని అర్థం.

రంగు మారడం - నెయ్యిలో ఏదైనా అసాధారణ రంగు మార్పును మీరు గమనిస్తే అది పాడైపోయిందని మీరు అర్థం చేసుకోవచ్చు.

వింతైన ఆకృతి - సాధారణంగా నెయ్యి మృదువైన , క్రీమీ ఆకృతిని కలిగి ఉంటుంది. కానీ నెయ్యిలో ఏదైనా ముద్దలు లేదా విడిపోవడాన్ని మీరు గమనిస్తే అది పాడైపోయిందని సంకేతం.

నెయ్యిని ఎక్కువ కాలం ఉపయోగించడానికి కొన్ని చిట్కాలు:

1. గాలి మరియు తేమ బారిన పడకుండా ఉండటానికి నెయ్యిని గాలి చొరబడని గాజు పాత్రలో నిల్వ చేయాలి.

2. నెయ్యిని ప్రత్యక్ష సూర్యకాంతి లేదా వేడి వనరుల నుండి దూరంగా ఉంచండి. దానికి బదులుగా, చల్లని , చీకటి ప్రదేశంలో ఉంచండి.

3. నెయ్యి పాడవకుండా ఉండటానికి మీరు నెయ్యిని పాత్ర నుండి తీసేటప్పుడు శుభ్రమైన చెంచాను ఉపయోగించడం మర్చిపోవద్దు. 

పైన చెప్పిన విధంగా నెయ్యిని సరిగ్గా నిల్వ చేస్తే, నెయ్యి 3 సంవత్సరాల వరకు పాడవదు.

Latest Videos

click me!