స్వీట్లను ఇష్టపడని వారు చాలా అరుదు అనే చెప్పొచ్చు. కొందరికి అయితే.. స్వాట్లంటే ఏకంగా పిచ్చి ఉంటుంది. స్వీట్ అయితే చాలు లాగించేస్తారు. ఇంకొందరికి భోజనం చేసిన తర్వాత మాత్రమే స్వీట్ తినే అలవాటు ఉంటుంది. కొందరు బెల్లం తింటారు.. కొందరు చాక్లెట్ తింటారు.. మరి కొందరు ఏదైనా డెజర్ట్ తినడానికి ఇష్టపడతారు. మరి.. ఇలా భోజనం తర్వాత స్వీట్ తినడం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం…
భోజనం తర్వాత స్వీట్లు ఏమౌతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ.. ఇది డయాబెటిక్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుందట. మీరు చదివింది నిజమే. భోజనం చేసిన ఒక గంట, గంటన్నర కి మన రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడం మొదలౌతాయి. అదే భోజనంతో పాటు స్వీట్ కూడా తినడం వల్ల షుగర్ లెవల్స్ మరింత రెట్టింపుగా పెరుగుతాయట. షుగర్ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరంగ మారుతుంది. కాబట్టి.. భోజనం తర్వాత స్వీట్ తినే ముందు కాస్త ఆలోచించడం మంచిది.
అంతేకాదు.. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఎవరైనా సరే.. భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల.. మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంది. స్వీట్స్ లో ఉండే షుగర్ లెవల్స్, ఫ్యాట్ కారణంగా క్యాలరీ కౌంట్ పెరిగి బరువు సులభంగా పెరిగిపోతారు.
అంతేకాదు.. భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి.. తొందర పడి స్వీట్లు తినకపోవడమే మంచిది.
అయితే, ఆయుర్వేదం ప్రకారం.. భోజనం తర్వాత స్వీట్ తినడం కాదు.. భోజనాన్ని మొదలుపెట్టడమే స్వీట్ తో మొదలుపెట్టాలట. ఆ తర్వాత సాల్ట్ తో ఉన్న ఆహారం తీసుకోవాలట. చివరన కూడా సాల్ట్ లేదా పెరుగు లాంటి వాటితో భోజనం పూర్తి చేయాలట. అంతేకానీ.. భోజనం తర్వాత స్వీట్ తినకూడదట.
భోజనాన్ని స్వీట్ తో మొదలుపెట్టడం వల్ల మన టేస్ట్ బడ్స్ యాక్టివ్ అవుతాయి. ఫలితంగా మనకు భోజనం రుచి తెలుస్తుందట. అందుకే.. భోజనాల్లో కూడా ముందుగా స్వీట్ వడ్డిస్తారు. ఇక స్వీట్స్.. ఇతర ఫుడ్స్ తో పోలిస్తే.. అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయట. అందుకే ముందు స్వీట్ తిని తర్వాత వేరేవి తినడం వల్ల.. ఆహారం సమానం గా అరుగుదంట. ఎలాంటి జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.