ప్రెజర్ కుక్కర్ దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది. దాదాపు చాలా మంది ఈ ప్రెజర్ కుక్కర్ లోనే వంట చేస్తూ ఉంటారు. ఎందుకంటే.. దీనిలో వంట చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఎక్కువ సేపు స్టవ్ దగ్గర నిలపడాల్సిన అవసరం ఉండదు. చాలా తక్కువ సమయం తీసుకుంటుంది కూడా. అందుకే అందరూ ప్రెజర్ కుక్కర్ మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ, ఈ ప్రెజర్ కుక్కర్ లో అన్ని రకాల వంటలు వండకూడదట.
pressure cooker
నిపుణుల ప్రకారం, మనం నార్మల్ గా వంట చేసిన దాని కంటే.. ప్రెజర్ కుక్కర్ లో వంట చేయడం వల్ల ఆ ఆహారంలోని న్యూట్రియంట్స్, పోషకాలు తగ్గిపోతాయట. కొన్ని ఫుడ్స్ అయితే పోరపాటున కూడా కుక్కర్ లో వండకూడదట. మరి, అవేంటో తెలుసుకుందాం..
1.అన్నం…
మనలో చాలా మంది ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండుతూ ఉంటారు. కానీ..అసలు అన్నాన్ని ప్రెజర్ కుక్కర్ లో వండకూడదట. ఎందుకంటే కుక్కర్ లో అన్నం వండటం వల్ల దాని ప్రెజర్ కారణంగా అరుగుదల సమస్యలు వస్తాయట. అంతేకాదు యూరిక్ యాసిడ్ కూడా పెరగడానికి కారణం అవుతుంది.
2.ఆకు కూరలు..
ఇక చాలా మంది ప్రెజర్ కుక్కర్ లో ఆకుకూరలు వండుతూ ఉంటారు. కానీ.. ఆకుకూరలు కూడా ప్రెజర్ కుక్కర్ లో పొరపాటున కూడా వండకూడదట. ఎందుకంటే ఇలా వండటం వల్ల దాని నుంచి నైట్రోజన్ వాయివు బయటకు విడుదల అవుతుందట. ఇది విషపూరితంగా మారుతుందట.
3.నూడిల్స్..
నూడిల్స్ కూడా ప్రెజర్ కుక్కర్ లో వండకూడదట. ఎందుకంటే వీటిలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టార్చ్ బయటకు వెళ్లిపోవాలి. ఇది అరుగుదల సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.
4.చేపలు..
చేపలను కూడా ప్రెజర్ కుక్కర్ లో వండకూడదు. ఇలా వండటం వల్ల చేప ఆకారం పాడవ్వడమే కాదు, అందులో నుంచి బ్యాక్టీరియా బయటకు వచ్చి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. అందుకే ఆ పొరపాటు చేయకూడదు. చేపలోని పోషకాలు కూడా తగ్గిపోతాయి, చేపలు మాత్రమే కాదు… సీ ఫుడ్స్ ఏవీ.. కుక్కర్ లో వండకూడదు.
5.పాస్తా…
పాస్తా కూడా ప్రెజర్ కుక్కర్ లో వండకూడదు. ఎందుకంటే.. పాస్తాలో కూడ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. దీనిని కుక్కర్ లో వండి తినడం వల్ల.. చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది
6.బంగాళ దుంపలు..
మీరు కనుక బంగాళ దుంపలను ప్రెజర్ కుక్కర్ లో వండుతున్నట్లయితే.. ఆ అలవాటును వెంటనే మార్చుకోవాలి. ఎందుకంటే .. కుక్కర్ లో వండటం వల్ల దానిలోని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.