మనం ఆహారంగా తీసుకునే ఉప్పు ప్రాథమికంగా సోడియం క్లోరైడ్. ఇందులో 40 నుంచి 60 శాతం వరకు సోడియం, క్లోరైడ్ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఉప్పు తీసుకోవడం ఎంత హానికరమో తెలుసుకుందాం. ఎక్కువగా ఉప్పు తీసుకునేవారు తప్పకుండా దీని గురించి తెలుసుకోవాలి.
విపరీతంగా ఉప్పు తీసుకోవడం అంటే విషం తీసుకున్నట్లే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం, చాలా మంది తమకు అవసరమైన దానికంటే రెండింతలు ఉప్పును తీసుకుంటున్నారు. WHO ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 1.89 మిలియన్ల మంది అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల మరణిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.