పానీ పూరీ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Jun 28, 2024, 3:45 PM IST

పానీపూరీని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పానీ పూరీని ఇష్టంగా తింటుంటారు. కానీ పానీపూరీని తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు.
 

పానీ పూరీ ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతిరోజూ వీటిని తినేవారున్నారు. నిజానికి చిన్న పిల్లలే కాకుండా పెద్దవారు కూడా పిల్లలతో వెళ్లి పానీపూరీలు తింటుంటారు. అయితే పానీపూరీలు ఆరోగ్యానికి మంచివి కావని చెప్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ పానీపూరీలు కూడా ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంటాయి. ఎలా అంటే పానీపూరీలో బంగాళాదుంప, చింతపండు, ఉల్లిపాయ, చిక్పీస్ తో పాటుగా మసాలా దినుసులు కూడా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అసలు పానీపూరీని తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


జీర్ణక్రియకు మంచిది

పానీపూరీ టేస్టీగా ఉండటమే కాకుండా ఇది మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియకు. పానీ పూరీ రసంలో ఉండే జీలకర్రతో సహా సుగంధ ద్రవ్యాల కలయిక మన జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తాయి. ఇది జీర్ణక్రియకు మంచి మేలు చేస్తుంది. 
 

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

డయాబెటీస్ పేషెంట్లకు పానీ పూరీ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. మిరియాలు, అల్లం, జీలకర్ర వంటి మసాలా దినుసు పానీపూరీ రసంలో ఉంటాయి. ఇవి మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. 
 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ఒక పానీ పూరీలో దాదాపుగా 36 కేలరీలు ఉంటాయి. మీరు దాదాపుగా ఆరు పానీ పూరీలు తింటే మీకు 216 కేలరీలు అందుతాయి. ఇవేం పద్దగా ఎక్కువ కావు. ఎందుకంటే ఇవి కేవలం రెండు చపాతీలకు సమానం కాబట్టి.

జలుబు దగ్గు నుంచి ఉపశమనం

వానాకాలంలో వాతావరణం పూర్తిగా మారుతుంది. దీనివల్ల పెద్దలతో పాటుగా పిల్లలు కూడా దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఇవి తగ్గాలంటే మందులను వాడాల్సిందే అంటారు చాలా మందది. కాీన మీరు పానీపూరీ రసంలో పుదీనాను కలిసి తీసుకుంటే మీకు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

pani puri

కడుపు నిండిన భావన

పానీపూరీ మీరు ఓవర్ గా తినకుండా కూడా చేస్తుంది. అవును పానీ పూరీలోని బంగాళాదుంపలు ఫైబర్ కు మంచి మూలం. ఇవి మీకు ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అంటే  ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 
 

విటమిన్లు, ఖనిజాలు

పానీపూరీలు విటమిన్లు, ఖనిజాలకు మంచి వనరులు. ఇవి మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. పానీపూరీలో విటమిన్ ఎ, విటమిన్ బి 6, విటమిన్ బి 12,విటమిన్ సి, విటమిన్ డి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. 
 

Latest Videos

click me!