బంగాళాదుంప-ఉల్లిపాయలను ఒకే దగ్గర నిల్వ చేస్తున్నారా? ఆ తప్పు చేయకండి..

First Published | Apr 30, 2021, 1:00 PM IST

ఆలుగడ్డ, ఉల్లిగడ్డ.. ప్రతీ గృహిణీ ఎక్కువగా వంటగదిలో ఉపయోగించే కూరగాయలు. ఏ కూరగాయా అందుబాటులో లేకుంటే రెండు ఆలుగడ్డలు, ఓ ఉల్లిగడ్డ కోసి పొయ్యిమీద వేస్తే రుచికరమైన కూర రెడీ అయిపోతుంది. పప్పుచారు పక్కన వేపుడుగా, మసాలా వేసి వండితే చికెన్ కు ధీటుగా తయారయ్యే బంగాళదుంపల కూర అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. ఇక ఉల్లిపాయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఇది లేకపోతే కూర తయారవ్వదు. 

undefined
అందుకే ప్రతి వంటింట్లోనూ ఇవి తప్పనిసరి. అంతేకాదు లాక్ డౌన్ సమయంలో ప్రతి ఇంట్లోనూ ఇవి రెండు ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకుంటున్నారు.
undefined

Latest Videos

అయితే చాలాసార్లు బంగాళ దుంపలు వేర్లు వచ్చేయడం కుళ్లిపోవడం, ఎండిపోవడం.. ఉల్లిపాయలు మురిగిపోవడం మొలకలు రావడం లాంటివి జరుగుతుంటాయి.
undefined
అయితే చాలాసార్లు బంగాళ దుంపలు వేర్లు వచ్చేయడం కుళ్లిపోవడం, ఎండిపోవడం.. ఉల్లిపాయలు మురిగిపోవడం మొలకలు రావడం లాంటివి జరుగుతుంటాయి.
undefined
దీనికి కారణం మీరు వాటిని సరిగ్గా నిల్వ చేయకపోవడమే. సరిగా నిల్వ చేయడం ద్వారా చాలా కాలం ఈ రెండింటిని తాజాగా ఉంచుకోవచ్చు. ఆ పద్ధతులేంటో చూడండి.
undefined
ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బంగాళాదుంప-ఉల్లిపాయలను ఎప్పుడూ కలపకూడదు. ఇలా రెండింటినీ ఒక్కచోటే కలిపి నిల్వ చేయడం వల్ల బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తుతాయి. వాటి రుచిని కోల్పోతాయి.
undefined
బంగాళాదుంప - ఉల్లిపాయలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఫ్రిజ్‌లో దుర్వాసన నిండిపోతుంది, అంతేకాదు వేరే కూరగాయలు పాడవుతాయి.
undefined
ఇక బంగాళాదుంపలలో ఎక్కువ మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, వీటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పుడు యాంటీఆక్సిడెంట్లు కోల్పోతాయి.
undefined
బంగాళాదుంప-ఉల్లిపాయలను టమోటాలు, అరటిపండ్లులాంటి ఇతర పండ్లతో ఎప్పుడూ కలిపి ఉంచకూడదు. దీనివల్ల టమోటాలు, పండ్లు త్వరగా పాడవుతాయి.
undefined
మరి వీటినెలా భద్రపరచాలి అంటే.. మామూలుగా ఇళ్లలో చాలా మంది బంగాళాదుంపలను బుట్టల్లో వేసి కౌంటర్‌టాప్‌ మీద పెడుతుంటారు. అయితే బంగాళాదుంపలను ఇలా బహిరంగంగా నిల్వ చేయకూడదు.
undefined
వాటిని డ్రాయర్‌లో కానీ, బుట్టలోకానీ, కాగితపు సంచిలో, వెదురుబుట్టల్లో పెట్టవచ్చు. వీటిని పెట్టేప్రాంతం చీకటిగా ఉండాలి. గాలి బాగా తగులుతూ ఉండాలి.
undefined
ఉల్లిపాయలను కూడా కాగితపు సంచిలో వేసి దానికి గాలికోసం చిన్న రంధ్రాలు చేయాలి. గాలి తగులుతుండడం వల్ల ఉల్లిపాయలు తాజాగా ఉంటాయి. వేడి సోకదు కాబట్టి కుళ్ళిపోకుండా ఉంటాయి.
undefined
యేడాదికి సరిపడా ఉల్లిపాయలను నిల్వ చేయాలనుకుంటే.. ముందుగా ఉల్లిపాయలను బాగా ఆరబెట్టండి. ఆ తరువాత ఎండతగలని, తేమ లేని ప్రదేశంలో ఉంచండి
undefined
ఉల్లిపాయలు నిల్ల చేసేముందు దాని ముచ్చు పూర్తిగా ఎండిందా లేదా అని చూడాలి. అప్పుడే అవి చాలాకాలం తాజాగా ఉంటాయి. ఆ తరువాత ఉల్లిపాయలను 4 నుండి 10 ° C లేదా 40 నుండి 50 ° ఫారెనైట్ మధ్య ఉన్న ప్రదేశంలో నిల్వ చేయండి.
undefined
click me!