రాత్రిపూట ఇవి తింటే.. మిమ్మల్ని నిద్రకూడా పోనివ్వవు..!

First Published | Apr 30, 2021, 3:22 PM IST

నిద్రవేళలో కొన్ని ఆహారాన్ని తినడం వల్ల నిద్రపోవడం కష్టమవుతుంది, మరికొన్ని రాత్రిపూట గుండెల్లో మంటను కలిగిస్తాయి. అందుకే కొన్ని రకాల ఫుడ్స్ ని  ఎవాయిడ్ చేయాలి.

ఆరోగ్యాన్ని కాపాడటంలో.. కూరగాయలు, పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. ఎంత ఆరోగ్యకరమైనవైనా పండ్ల విషయంలో మాత్రం.. ఎలా తినాలి..? ఎప్పుడు తినాలి అనే విషయం తెలుసుకోవాలట. లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఆరోగ్యంగా ఉండాలన్నా.. బరువు తగ్గాలన్నా రాత్రిపూట తినే ఆహారంపై దృష్టిపెట్టాల్సిన అవసరం చాలా ఉందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట కొన్ని రకాల ఫుడ్స్ ని అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..

మనం తీసుకునే ఆహారంలో పోషకాహారం ఉండొచ్చు. అయితే.. దానికి ఏ సమయంలో తెలియకపోతే మాత్రం సమస్యలో పడొచ్చు. కొన్ని రకాల ఫుడ్స్ ని కొన్ని సమయాల్లో తింటే మాత్రమే మనకు ఉపయోగకరంగా ఉంటుంది.
నిద్రవేళలో కొన్ని ఆహారాన్ని తినడం వల్ల నిద్రపోవడం కష్టమవుతుంది, మరికొన్ని రాత్రిపూట గుండెల్లో మంటను కలిగిస్తాయి. అందుకే కొన్ని రకాల ఫుడ్స్ ని ఎవాయిడ్ చేయాలి.
రాత్రి సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే.. చీజ్ ఉన్న ఆహారాలు తినకూడదు. అదేవిధంగా నూనెలో వేయించిన ఫుడ్స్ కూడా తినకూడదు. దాని వల్ల అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
కొందరు.. రాత్రి పూట నిద్రపడుతుందికదా అని.. బీర్, వైన్ లాంటివి తాగుతూ ఉంటారు. అయితే.. అది నిజం కాదట.. రాత్రి వేళ ఇవి తీసుకవడం మంచిది కాదట.
మద్యం నిద్రను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అదనంగా, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. గురక కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి.. దానికి కూడా దూరంగా ఉండటం మంచిది.
వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరాదోస లాంటి ఫుడ్ కూడా రాత్రిపూట తీసుకోకూడదు. దాని వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఈ క్రమంలో బ్లాడర్ త్వరగా ఫిల్ అయ్యి.. అర్థరాత్రి మెళకువ వస్తుంది. దీంతో.. సరిగా నిద్రపోయిన ఫీలింగ్ ఉండదు. ఇది కూడా నిద్రను నాశనం చేస్తుంది.
సరైన నిద్రలేకపోవడం వల్ల అజీర్తి సమస్యలు మొదలౌతాయి. కారం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కడుపులో మంట లాంటివి మొదలౌతాయి. కాబట్టి.. స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండాలి.
అరటిపండు తినడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. బరువు పెరగాలి అనుకునేవారికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. కానీ రాత్రిపూట మాత్రం వీటిని తినడం అస్సలు మంచిదికాదు. అది చర్మానికి అంత మంచిది కాదు. అయితే.. డిన్నర్ తో కలిపి తీసుకుంటే మాత్రం ఏమీ కాదట. పడుకునే మందు మాత్రం తినకూడదు.
ఆపిల్‌లోని ఫైబర్ రకం పెక్టిన్ రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ రాత్రి సమయంలో జీర్ణించుకోవడం కష్టం. యాసిడ్ తయారవ్వడానికి కారణమౌతుంది.
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ వంటి కూరగాయల్లో ఎన్నో రకాల ప్రోటీన్స్, న్యూట్రిన్స్ ఉంటాయి. అయితే.. ఇవి రాత్రి పూట మాత్రం తీసుకోకూడదట. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. అరగడానికి చాలా సహాయం తీసుకుంది. దాని వల్ల నిద్ర సరిగా పోలేరు. కాబట్టి.. ఈ కూరగాయలను రాత్రిపూట తినకపోవడమే మంచిది.
బాదం, పిస్తా, ఆక్రోట్ వంటి నట్స్ కూడా రాత్రిపూట తినడం మంచిది కాదట. వీటిలో కేలరీలు, కొవ్వు అధికంగా ఉండటం వల్ల రాత్రి సమయంలో తినడం అంత మంచిది కాదని సూచిస్తున్నారు.
డార్క్ చాక్లెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కానీ ఇందులో కెఫిన్ అమైనో ఆమ్లం కూడా ఉంటాయి. నిద్రవేళలో డార్క్ చాక్లెట్ తినడం మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోలేరు.

Latest Videos

click me!