సగ్గుబియ్యం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా..?

First Published | Apr 29, 2021, 1:05 PM IST

సగ్గుబియ్యం అనేక పోషకాలతో తయారైన సమతుల్య ఆహారం. దీనిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీనానికి కచ్చితంగా అవసరమైనవి.

సగ్గుబియ్యం.. వీటి గురించి తెలియని వారు ఉండరేమో. కొన్ని స్నాక్స్ తయారీలో వీటిని వాడతారు. అంతేకాదు.. జావా లా చేసుకొని కూడా తాగుతారు. ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే.. వేడి తగ్గడానికి సగ్గుబియ్యం జావ తాగమని సలహా ఇస్తూ ఉంటారు. కేవలం వేడి తగ్గించడమే కాదు.. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..
వీటిలో కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. వీటిలో కాల్షియం, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు.. ఎముక నొప్పులను త్వరగా నయం చేయవచ్చు.

సగ్గుబియ్యం అనేక పోషకాలతో తయారైన సమతుల్య ఆహారం. దీనిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీనానికి కచ్చితంగా అవసరమైనవి.
వీటిని ప్రతిరోజూ ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల ఎముక బలంగా మారుతుంది. ఎముక బలంగా మారడానికి కాల్షియం అవసరం. దానికి సరిపడే కాల్షియం.. ఈ సగ్గుబియ్యంలో పుష్కలంగా ఉంటుంది.
దీనిని సలాడ్ రూపంలో కూరగాయలతో కలిపి తీసుకుంటే.. మెగ్నీషియం లభిస్తుంది. ఇది కూడా ఎముక బలానికి సహాయపడుతుంది.
దీనిని సలాడ్ రూపంలో కూరగాయలతో కలిపి తీసుకుంటే.. మెగ్నీషియం లభిస్తుంది. ఇది కూడా ఎముక బలానికి సహాయపడుతుంది.
బ్రేక్ ఫాస్ట్ సమయంలో మెగ్నీషియం శరీరానికి అందితే చాలా మంచిది. కాబట్టి.. ఆ సమయంలో.. సగ్గుబియ్యంతో చేసిన ఆహారం తినడం ఉత్తమం. ఉదయాన్నే సగ్గుబియ్యం తినడం వల్ల ఆ రోజంతా ఎనర్జీతో... యాక్టివ్ గా ఉంటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
అంతేకాదు.. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఫుడ్. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కార్బో హైడ్రేట్స్ శక్తిని ఇస్తాయి.
కడుపులో నొప్పి.. లేదా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇవి తీసుకుంటే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. గ్యాస్ సమస్యతో బాధపడేవారికి కూడా వెంటనే సత్వర పరిష్కారం దొరుకుతుంది. అరుగుదలకు సహాయపడుతుంది.
దీనిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మజిల్ గ్రోత్ కి సహాయం చేస్తుంది. మజిల్ ఆరోగ్యానికి ఇది ఎంతగానో సహాయం చేస్తుంది.

Latest Videos

click me!