ప్రస్తుత కాలంలో. చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాలుష్యం, మద్యం, ఒత్తిడి , ధూమపానం తదితర కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్యం దరి చేరుతున్నాయి. అయితే.. వృద్ధాప్యం, చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం ఆహారం. ఒక వైపు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం ఊబకాయం ప్రమాదాన్ని పెంచేస్తాయి. వయసుకు మించి కూడా కనపడతారు. అయితే... కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల వృద్ధాప్యం దరిచేరకుండా కాపాడుకోవచ్చట. మరి ఆ ఆహారాలేంటో ఓసారి చూసేద్దామా..
ఎంతటివారైనా వృద్ధాప్య దశకు చేరుకోక తప్పదు. అయితే.. ఆ వృద్ధాప్యం తొందరగా రాకుండా.. కాస్త ఆలస్యం చేసే అవకాశం మాత్రం మన చేతుల్లో ఉంది. మనం తీసుకునే ఆహారంతో ఇది సాధ్యమౌతుంది. ఈ వృద్ధాప్యాన్ని మన దరి చేరుకుండా చేసే కొన్ని ఆహారాలు తీసుకుంటే.. యవ్వనంతో మెరిసిపోవచ్చని చెబుతున్నారు.
ముఖ్యంగా , 50 సంవత్సరాల వయస్సు తర్వాత, ఈ కూరగాయలను ప్రతిరోజూతీసుకోవడం వల్ల.. వయసు రీత్యా వచ్చే చాలా సమస్యలను కంట్రోల్ చేయవచ్చటని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా. ఆ వయసు నుంచి ముసలి తనాన్ని.. కాస్త నెమ్మదిగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
blue berry
బ్లూబెర్రీస్: విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ బెర్రీలు ఆరోగ్య ప్రయోజనాలకు పవర్‌హౌస్‌గా ఉన్నాయి - ఇది బరువు తగ్గడం లేదా వృద్ధాప్యం కోసం కావచ్చు. వేగవంతమైన వృద్ధాప్యానికి సెల్ నష్టం ప్రధాన కారణం. 2012 అధ్యయనం 2020 సమీక్ష ప్రకారం, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో బ్లూబెర్రీస్ కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధనలో తేలింది.
నట్స్: బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, బ్రెజిల్ నట్స్ ప్రతిరోజూ గుప్పెడు తీసుకోవడం వల్ల అందంగానూ, ఆరోగ్యంగాను ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. 50 సంవత్సరాల వయస్సు తర్వాత, ఈ రుచికరమైన ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు , ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడమే కాకుండా మధుమేహ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడతాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జీవక్రియ రుగ్మతలను కూడా నివారిస్తాయి.
అవకాడోస్: విటమిన్ B, C, ఫోలేట్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్‌తో, అవకాడోలు యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి మీకు 50 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా.. వీటిని తినడం వల్ల వయసు పెద్దగా పెరగకుండా సహాయపడుతుంది.