Weight loss: బరువు తగ్గడానికి తాప్సీ పన్ను.. తీసుకునే డ్రింక్ ఇదే..!

First Published | Nov 20, 2021, 2:56 PM IST

ప్రతిరోజూ సూర్యాస్త సమయంలో.. తాప్సీ ఓ డ్రింక్ తాగేదట. ఆ డ్రింక్ కారణంగానే తాను సులభంగా బరువు తగ్గగలిగానని ఆమె చెప్పడం గమనార్హం. తాను తీసుకునే డ్రింక్.. శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయం చేస్తుందని ఆమె చెప్పారు. 

Tapsee panu caption

బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో సెలబ్రెటీలు కూడా ఉంటారు.  కాగా.. హాట్ బ్యూటీ తాప్సీ పన్ను.. సినిమాల్లోకి అడుగుపెట్టిన కొత్త చాలా బొద్దుగా ఉండేది. కానీ.. ఇప్పుడు ఎంతో ఫిట్ గా కనిపిస్తోంది. తాను అలా సులభంగా బరువు తగ్గి.. ఇప్పుడు ఇంత ఫిట్ గా కనపడటానికి ఆమె ఏం చేసింది..? ఈ విషయాన్ని తాజాగా.. సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రతిరోజూ సూర్యాస్త సమయంలో.. తాప్సీ ఓ డ్రింక్ తాగేదట. ఆ డ్రింక్ కారణంగానే తాను సులభంగా బరువు తగ్గగలిగానని ఆమె చెప్పడం గమనార్హం. తాను తీసుకునే డ్రింక్.. శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయం చేస్తుందని ఆమె చెప్పారు. యాపిల్ సైడర్ వెనిగర్, మెంతులు, పసుపు, అల్లం కలిపి తీసుకుంటుందట. వాటితోనే తాను బరువు తగ్గానని చెప్పారు.


వ్యాయామం చేసి కండరాల నొప్పితో బాధపడుతున్న సమయంలో ట్యాబ్లెట్స్ కి బదులు అల్లం, పసుపు తీసుకునేదానినని.. దాని వ్లల.. ఆ నొప్పి నుంచి బయటపడగలిగే దానిని ఆమె చెప్పారు. యాపిల్ సైడర్ వెనిగర్, మెంతులు, పసుపు, అల్లం కలయికతో తయారు చేసిన డ్రింక్ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం..
 

ఆపిల్ సైడర్ వెనిగర్ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది హృదయ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది అతిగా తినడం  అనే అలవాటు నుంచి మిమ్మల్ని ఆపివేస్తుంది  తద్వారా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

దీనిని మొదటి సారి తీసుకున్నట్లయితే.. కొద్ది మిశ్రమంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఎందుకంటే ఇది అసిడిటీ ,జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. 

fenu greek water

మెంతులు
వివిధ ఆరోగ్య పరిస్థితులకు చికిత్స చేయడానికి మెంతులు  చాలా కాలంగా ఉపయోగించబడుతున్నాయి. పరిమిత మానవ అధ్యయనాలు ఉన్నప్పటికీ, కొన్ని అధ్యయనాలు మెంతులు ఆకలిని అణచివేయడం, సంతృప్తిని పెంచడం , కేలరీల తీసుకోవడం తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయని సూచిస్తున్నాయి.

అల్లం
2017 సమీక్ష ప్రకారం  అల్లంలోని షోగోల్స్ బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి. ఊబకాయం ఉన్న స్త్రీలు 12 వారాల పాటు రోజుకు 1 గ్రాము అల్లం తీసుకుంటే వారిలో ఆకలి తగ్గుతుందట. సులభంగా బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుందట.


పసుపు
బరువు తగ్గడంలో పసుపు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. టెస్ట్-ట్యూబ్ అధ్యయనాలు కర్కుమిన్ స్థూలకాయంలో పాత్ర పోషిస్తున్న నిర్దిష్ట ఇన్ఫ్లమేటరీ మార్కర్లను అణిచివేస్తుందని సూచిస్తున్నాయి. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు పసుపు తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గవచ్చు. 

Latest Videos

click me!