కరివేపాకు బీపీని తగ్గిస్తుంది.. దీన్ని ఎలా తినాలంటే?

First Published | Oct 9, 2023, 10:30 AM IST

కరివేపాకు ఫుడ్ రుచిని పెంచుతుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తింటే అధిక రక్తపోటు తగ్గుతుందని నిపుణుల చెబుతున్నారు. ఇందుకోసం కరివేపాకును ఎలా తినాలంటే? 

ఇండియన్ ఫుడ్ ను ప్రపంచ దేశాలు కూడా బాగా ఇష్టపడతాయి.  ఎందుకంటే ఆహారం రుచిని పెంచే మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వాటిలో కరివేపాకు ఒకటి. దీనిని సాధారణంగా భారతీయ వంటకాల్లో మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. ఈ ఆకు ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది గుండెను రక్షించడానికి సహాయపడుతుంది.  ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. 

curry leaves

కరివేపాకు రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుందన్న ముచ్చట చాలా మందికి తెలియదు. ఈ ఆకుల్లో అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడే లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు. మీకు కూడా అధిక రక్తపోటు సమస్య ఉంటే కరివేపాకులను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి. మరి అధిక రక్తపోటుతో బాధపడేవారు కరివేపాకును డైట్ లో చేర్చుకోవడం ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 


యాంటీఆక్సిడెంట్ లక్షణాలు

కరివేపాకులో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ ఆక్సీకరణ ఒత్తిడి రక్తనాళాల నష్టం, మంటను కలిగిస్తుంది. ఈ రెండూ అధిక రక్తపోటుతో సంబంధం కలిగి ఉంటాయి.

పొటాషియం కంటెంట్

కరివేపాకు పొటాషియానికి మంచి మూలం. ఇదొక ఖనిజం. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ పొటాషియం సోడియం ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. పొటాషియం పుష్కలంగా ఉండే కరివేపాకు తినడం వల్ల మీ శరీరంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. 
 

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు

దీర్ఘకాలిక మంట కూడా అధిక రక్తపోటుతో సంబంధం కలిగి ఉంటుంది. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలలో మంటను తగ్గించడానికి, వాటి పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి.

Vasodilation

కరివేపాకులోని కొన్ని సమ్మేళనాలు వాసోడైలేషన్ ను ప్రోత్సహిస్తాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ధమనుల గోడలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో అధిక రక్తపోటు తగ్గుతుంది. 
 

కరివేపాకును ఎలా డైట్ లో చేర్చుకోవాలంటే? 

కరివేపాకు టీ ని తయారుచేసుకుని తాగండి. లేదా వేడి నీటిలో ఎండిన కరివేపాకును మరిగించి కూడా తాగొచ్చు.
కరివేపాకును అన్నం లేదా ఇతర వంటల్లో గార్నిషీగా కూడా ఉపయోగించొచ్చు. 
ఇంట్లో తయారుచేసిన మసాలా మిశ్రమంలో కరివేపాకు వేసి కలపొచ్చు.
కూరలు, సూప్లలో కరివేపాకును తాజాగా లేదా ఎండబెట్టి చేర్చొచ్చు.

Latest Videos

click me!