భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 27, 2024, 12:26 PM IST

భోజనం చేసిన వెంటనే చిన్న బెల్లం ముక్క తినడం వల్ల... తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది.  బ్లోటింగ్, అరుగుదల సమస్యలు ఏవైనా ఉంటే సులభంగా తగ్గుతాయి.

jaggery

భోజనం తర్వా త స్వీట్ తింటే మంచిది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే... స్వీట్ తినమని చెప్పారు కదా అని  మార్కెట్లో దొరికే.. ఏవేవో పందారతో చేసే స్వీట్స్ కాకుండా.. మన కిచెన్ లో ఉండే బెల్లం ఎంచుకోవాలి. ఇప్పుడంటే.. ఈ సంప్రదాయాన్ని అందరూ మర్చిపోయారు కానీ.. ఒకప్పుడు.. అంటే తాత ముత్తాతల కాలంలో.. ప్రతి ఒక్కరూ భోజనం చేసిన ప్రతిసారీ.. చిన్న బెల్లం ముక్క తినేవారట. అలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

jaggery 4p

బెల్లం మన శరీరానికి అవరసరమైన ఐరన్ అందిస్తుంది. అంతేకాదు.. బెల్లం తినడం వల్ల  జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయట. భోజనం చేసిన వెంటనే చిన్న బెల్లం ముక్క తినడం వల్ల... తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది.  బ్లోటింగ్, అరుగుదల సమస్యలు ఏవైనా ఉంటే సులభంగా తగ్గుతాయి.


jaggery 5p

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.  మన శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడి, లేదంటే.. ఏదైనా గుండె సంబంధిత సమస్యలు రాకుండా  రాకుండా కాపాడటంలోనూ సహాయం చేస్తాయి.

బెల్లం తినడం వల్ల.. మెటబాలిజం మెరుగుపడుతుంది. అంతేకాదు.. శరీరంలో క్యాలరీలు సులభంగా బర్న్ చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా..మన బరువు ఆరోగ్యకరంగా ఉండేలా, అధిక బరువు పెరగకుండా ఆపేయడంలో సహాయపడుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఇది చాలా మెరుగ్గా ఉపయోగపడుతుంది.
 

బెల్లం మనకు సహజంగా డీ టాక్సిఫయ్యర్ గా సహాయపడుతుంది. భోజనం తర్వాత.. చిన్న బెల్లం ముక్క తినడం వల్ల...బాడీ ని డీటాక్సిఫై చేస్తుంది. అంతేకాకుండా.. లివర్ ని శుభ్రంగా ఉంచడంలో మెరుగ్గా పని చేస్తుంది. లివర్ ఓవరాల్ ఆరోగ్యానికి ఈ చిన్న బెల్ల ముక్క చాలా సమర్థవంతంగా పని చేస్తుంది.

ఎవరైనా అనీమియా, రక్త హీనతతో బాధపడుతున్నట్లయితే... వారు భోజనం తర్వాత.. చిన్న బెల్లం ముక్క తినాల్సిందే. హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు కచ్చితంగా  ఈ బెల్లం ముక్క తినాల్సిందే.
 

బెల్లంలో లాక్సటివ్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి...  మలబద్ధకం సమస్యను చాలా ఈజీగా తగ్గించేస్తాయి. మలబద్దం తగ్గి..  మల విసర్జన చాలా స్మూత్ గా జరుగుతుంది.

ఒక్కోసారి మనకు  ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్లు.. చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే.. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే... నీరసం మొత్తం మటుమాయం అయిపోతుంది.

jaggery

అంతేనా.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది దివ్య  ఔషధంలా పని చేస్తుంది. కామన్ గా, సీజనల్ గా వచ్చే చాలా రకాల ఆరోగ్య సమస్యలు అంటే.. జలుబు దగ్గు, జ్వరం లాంటివి తగ్గించడంలో కీలకంగా పని చేస్తుంది.

jaggery

ఆస్తమా లాంటి సమస్యలను తగ్గించడమే కాదు...  మన చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. చర్మం చాలా అందంగా మారుతుంది. మన శరీరంలో ఎలక్ట్రో లైట్స్ ని  బ్యాలెన్స్ చేయంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ కీలకంగా పని చేస్తుంది. 

Latest Videos

click me!