
Coca Cola Formula : ప్రపంచవ్యాప్తంగా శీతల పానీయాల మార్కెట్ లో ఆధిపత్యం చెలాయిస్తోంది కోకా కోలా. దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా దీని హవా కొనసాగుతోంది... అమెరికాలో ప్రారంభమైన దీని ప్రస్థానం ఖండాంతరాలు దాటింది. భారతదేశంలో కూడా కోకా కోలాదే హవా... శీతల పానీయాల మార్కెట్ లో 50 శాతానికి పైగా వాటా దీనిదే. దీన్నిబట్టే కోకా కోలాను ఇష్టపడేవారు దేశంలో ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
సంవత్సరాలు గడిచిపోతున్నాయి... తరాలు మారుతున్నాయి... అనేక శీతల పానీయాలు మార్కెట్లోకి వస్తున్నాయి... పోటీని తట్టుకోలేక కనుమరుగు అవుతున్నాయి... కానీ కోకా కోలా హవా మాత్రం తగ్గడంలేదు. దీన్ని తలదన్నే కూల్ డ్రింక్స్ రావడం లేదు... దీన్నే కాపీ కొడదామా అంటే తయారీ ఫార్ములా బయటకు వచ్చే అవకాశాలు లేవు. కోకా కోలా తయారీ విధానం ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకే తెలియదట... అత్యంత సీక్రెట్ గా ఫార్ములాను కాపాడుకుంటోంది కంపెనీ.
తాజాగా ఓ యూట్యూబర్ కోకా కోలా ఫార్ములాను కనుగొన్నానంటూ ప్రకటించుకున్నాడు. కేవలం మాటలు కాదు ఏకంగా కోకా కోలా రెసిపీ వీడియోను రూపొందించి యూట్యూబ్ లో పెట్టాడు. వందేళ్లకు పైగా సీక్రెట్ గా ఉన్న కోకా కోలా రెసిపీ ఇదేనంటూ అతడు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 25 నిమిషాల వీడియోలో కోకా కోలా తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, ఎంత మోతాదులో కలిపితే ఆ టేస్ట్ వస్తుందో వివరించాడు. ఈ కోకా కోలా తయారీ వీడియోను ఇప్పటికే లక్షలాదిమంది వీక్షించారు.
యూట్యూబ్ లో సైన్స్ కు సంబంధించిన వీడియోలు రూపొందిస్తుంటుంది ల్యాబ్ కోట్జ్ (LabCoatz) ఛానల్. ఇందులోనే ఇటీవల కోకా కోలా రెసిఫీ ఇదేనంటూ వీడియో ప్రత్యక్షమయ్యింది. మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ తో కోలాబరేట్ అయి కోకా కోలా రెసిపీపై పనిచేశారు. ఈ క్రమంలో రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా కోకా కోలా ఫార్ములాను కనుగొన్నట్లు ల్యాబ్ కోట్జ్ యూట్యూబ్ ఛానల్ వెల్లడించింది.
కోకా కోలా తయారీకి ఏఏ పదార్థాలు, ఏ మోతాదులో వాడతారో ఇందులో వివరించారు. కోకా కోలా బాటిల్ పైనే కార్బోనేట్ వాటర్, హై ప్రక్టోస్ కార్న్ సిరప్, కారమెల్ కలర్స్, ఫాస్పరిక్ యాసిడ్, కెఫెన్ వాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వీటితో పాటు కోకా కోలా సీక్రేట్ రెసెపీ అయిన నేచురల్ ప్లేవర్స్ వాడుతున్నట్లు ఉంటుంది... ఇవి ఏమిటన్నదే తాజాగా ల్యాబ్ కోట్జ్ యూట్యూబ్ ఛానల్ బైటపెట్టింది.
కేవలం కోకా కోలాను ల్యాబ్ లో తయారుచేయడమే కాదు దాన్ని చాలామందితో టేస్ట్ చేయించారు. ల్యాబ్ లో తయారుచేసినట్లు ముందే చెప్పకుండా తాగడానికి ఇచ్చారు... దీన్ని టేస్ట్ చేసినవారు కోకా కోలానే తాగినట్లు చెప్పారు. అంటే సేమ్ కోకా కోలా టేస్ట్ ఉంది కాబట్టి ఇదే ఫార్ములాను కంపెనీ కూడా ఉపయోగిస్తూ ఉంటుందని ల్యాబ్ కోట్జ్ యూట్యూబ్ ఛానల్ పేర్కొంది.
ఇలా కోకా కోలా రెసిపీ ఇదేనంటే వైరల్ అవుతున్న యూట్యూడ్ వీడియోపై కంపెనీ మాత్రం స్పందించడంలేదు. బ్రాండ్ నేమ్ ఉపయోగించకుండా కోకా కోలా టేస్ట్ ను మాత్రమే రీక్రెయేట్ చేశాం... ఇదేమీ ఇల్లీగల్ కాదని యూట్యూబ్ ఛానల్ పేర్కొంటొంది. మరి కోకా కోలా కంపెనీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కోకా కోలా తయారీ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కోకా కోలాను అమెరికాకు చెందిన ఫార్మాసిస్ట్ జాన్ పెంబర్టన్ 1886 లో తయారుచేశారు. అయితే దీనికి మరిన్ని పదార్థాలు కలిపి కోకా కోలా బ్రాండ్ ను క్రియేట్ చేసింది మాత్రం ప్రాంక్ రాబిన్సన్. ఈ శీతల పానియాన్ని మరెవ్వరూ తయారుచేయకుండా ఉండేందుకు రెసిపీని అత్యంత సీక్రెట్ గా ఉంచుతున్నారు... ప్రస్తుతం దీన్ని తయారుచేసే కంపెనీ యాజమాన్యానికి కూడా రెసిపీ తెలియదంటే అతిశయోక్తిగా ఉంటుంది... కానీ ఇదే నిజం.
కోకా కోలా రెసిపీ కేవలం ఇద్దరు ఉద్యోగులకు మాత్రమే తెలుసట... అది కూడా ఒకరికి సగభాగం, మరోకరికి ఇంకో సగభాగం మాత్రమే తెలుసట. ఈ ఉద్యోగులు వేరువేరు ప్రాంతాల్లో పనిచేస్తారు... ఒకరిని మరొకరు కలిసే అవకాశం చాలా తక్కువట. అందువల్లే కోకా కోలా ఫార్ములా బయటపడే అవకాశాలు లేవని కంపెనీ చెబుతోంది. అయితే కోకా కోలా పూర్తి ఫార్ములా మాత్రం అట్లాంటాలోని సన్ ట్రస్ట్ బ్యాంకులో ఉంది.