టేస్టీ టేస్టీ జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్... తిన్నారంటే మైమరచిపోతారు..

First Published | Jun 24, 2021, 5:04 PM IST

మేఘాన్ని తుంచి నోట్లో వేసుకున్నట్టుగా.. మెత్తగా, మృధువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే క్లౌడ్ ఆమ్లెట్ ఒక్కసారి తింటే పదే పదే తినాలనిపిస్తుంది. ఆమ్లెట్ ప్రియులు దీన్ని చాలా ఇష్టపడతారు. 

మేఘాన్ని తుంచి నోట్లో వేసుకున్నట్టుగా.. మెత్తగా, మృధువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే క్లౌడ్ ఆమ్లెట్ ఒక్కసారి తింటే పదే పదే తినాలనిపిస్తుంది. ఆమ్లెట్ ప్రియులు దీన్ని చాలా ఇష్టపడతారు.
undefined
మామూలుగా ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. రుచికోసం రకరకాల ఆమ్లెట్ ను ట్రై చేస్తుంటారు. ఇక దోశల్లో, చపాతీల్లో, స్నాక్ గా ఇలా అనేక రకాలుగా ఆమ్లెట్ తినడానికి ట్రై చేస్తారు. మీలాంటి వారికోసమే జపాన్ స్పెషల్ క్లౌడ్ ఆమ్లెట్ గురించి తెలుసుకుందాం.
undefined

Latest Videos


తయారు చేయడం ఈజీ, పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు. కావాల్సిందల్లా గుడ్లు, ఉప్పు, మిరియాల పొడి అంతే. అంతేకాదు ఎంతో హెల్తీ కూడా. మరి అదెలా తయారు చేస్తారో చూడండి..
undefined
క్లౌడ్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు2 గుడ్లు14 టీస్పూన్ మిరియాల పొడి1 టేబుల్ స్పూన్ వెజిటబుల్ ఆయిల్రుచికి తగినంత ఉప్పు2 టేబుల్ స్పూన్ల నీళ్లు
undefined
క్లౌడ్ ఆమ్లెట్ తయారు చేసే విధానంముందుగా కోడిగుడ్డులోని తెల్లసొన, పచ్చసొనను వేరు చేయాలి. ఈ రెండింటిని విడివిడిగా రెండు వేర్వేరు గిన్నెల్లో తీసుకోవాలి.
undefined
ఎలక్ట్రిక్ విస్కర్ ఉపయోగించి తెల్లసొనను నురుగు వచ్చేవరకు విస్క్ చేయాలి. ఇప్పుడు గుడ్డు పచ్చసొనకు 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి దీన్ని కూడా బాగా నురుగు వచ్చేవరకు గిలక్కొట్టాలి.
undefined
రెండూ బాగా నురగవచ్చాయని నిర్థారించుకున్నాక.. దీనికి రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి కలపండి,
undefined
ఇప్పుడు ఒక నాన్-స్టిక్ పాన్ స్టవ్ మీద పెట్టుకుని వేడయ్యాక కొంచెం నూనె వేసి గుడ్డు పచ్చసొన మిశ్రమాన్ని పోయాలి. గుండ్రంగా వచ్చేలా పాన్ ను తిప్పండి. దీనిమీద ఒక మూతతో పెట్టి, కొద్దిసేపు ఉడికించాలి.
undefined
3-4 నిమిషాల తరువాత, మూత తీసి, గుడ్డులోని తెల్లసొన మిశ్రమాన్ని దీని మీద పోసి పూర్తిగా పచ్చసొన మీద ఆక్రమించేలా చూడండి. మళ్ళీ మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించాలి.
undefined
అంతే, ఉడికిన తరువాత దీన్ని మధ్యలోకి మడిచి సర్వ్ చేయండి. మీ క్లౌడ్ ఆమ్లెట్ రెడీ అయిపోనట్టే.
undefined
click me!