పెరుగులో బెల్లం కలుపుకొని తింటే... ఎన్ని లాభాలో..!

First Published | May 10, 2021, 1:18 PM IST

పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. అయితే.. దీనిని కేవలం మధ్యాహ్నం లంచ్ తర్వాత మాత్రమే తీసుకోవాలట. రాత్రిపూట తీసుకోవడం వల్ల ఇతర అనర్థాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ ఎండాకాలం వేడి తట్టుకోవాలంటే పెరుగు తినడం మన ముందున్న మార్గం. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కేవలం వేడి తగ్గించడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు పెరుగు వల్ల కలుగుతాయి. అరుగుదల సమస్యలను తగ్గించడంతోపాటు.. పొట్ట సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
అంతేకాదు.. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రైబోఫ్లేవిన్, విటమిన్ బీ6, విటమిన్ బీ12 ఉన్నాయి. అయితే.. సాధారణంగా మనం పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటాం. అదే.. పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. అయితే.. దీనిని కేవలం మధ్యాహ్నం లంచ్ తర్వాత మాత్రమే తీసుకోవాలట. రాత్రిపూట తీసుకోవడం వల్ల ఇతర అనర్థాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఇది చాలా సహాయం చేస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది రోగనిరోధక శక్తి సరిగాలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారు దీనిని తీసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం.
పెరుగు మనకు సహజంగా లభించే ఒక శక్తి వనరు. నిద్రలేమి సమస్య నుంచి పరిష్కారం చూపిస్తుంది. అయితే.. బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయట.
రక్త ప్రసరణ మెరుగుపడటానికి సహాయం చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. హైపర్ టెన్షన్ ప్రమాదం నుంచి కూడా కాపాడుతుంది.
దంతాలు, ఎముకలు బలంగా తయారవ్వడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. దీనిలో కాల్షియం మెండుగా ఉంటుంది.
మరియు పెరుగు మరియు బెల్లం తీసుకోవడం కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంది. ఇది మలబద్ధకం, విరేచనాలు ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది.
చర్మం, జుట్టుకు పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చుండ్రు సమస్యను కూడా తగ్గించగలదు. సుమారు 30 నిమిషాలు జుట్టుకి పెరుగు అప్లై చేసి.. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.
బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా ఇది సహాయం చేస్తుంది. పెరుగులో బెల్లం కలపుకొని తింటే సులువుగా బరువు తగ్గుతారు.

Latest Videos

click me!