డిన్నర్‌లో పండ్లు తినడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండకపోవచ్చు కానీ ఉదయం, మధ్యహ్న భోజనంలో సమతుల్య పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేసి, రాత్రి భోజనంలో పండ్లు మాత్రమే తింటే, అది ఖచ్చితంగా మంచిది కాదు అని పోషకాహార నిపుణులు అంటున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందకుండా పోవడం వల్ల జుట్టు రాలడం, చర్మం మొద్దుబారడం, ఎముకలు రాలడం వంటివి జరుగుతాయి. కాబట్టి... బరువు తగ్గాలనే పిచ్చిలో పడి.. పిచ్చి డైట్స్ ఫాలో అవ్వకుండా... పౌష్టికాహారం తీసుకోవడం ఉత్తమం.