మీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందా? వీటిని తినండి పెరుగుతుంది

First Published | Jun 6, 2023, 3:13 PM IST

రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలు వస్తాయి. అయితే కొన్ని ఆహారాలను తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 
 

రోగనిరోధక శక్తి  ప్రాముఖ్యత గురించి ప్రస్తుతం అందరికీ తెలుసా? ఈ ఇమ్యూనిటీ పవరే మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. ఇది తక్కువగా ఉన్నవారికే అంటువ్యాధులు, ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలంటే మాత్రం ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినాలి, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఫ్యాటీ ఫిష్

కొవ్వు చేపల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు ఉంటాయి. ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలను మీ ఆహారంలో చేర్చడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 


సిట్రస్ పండ్లు

నిమ్మకాయ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తింటే మీ రోగనిరోధక శక్తిని బాగా పెరుగుతుంది. 
 

garlic

వెల్లుల్లి

వెల్లుల్లిని ప్రతి వంటలో వాడుతుంటారు. ఈ మసాలా దినుసులు వంట రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. వెల్లుల్లిని ఆహారంలో చేర్చడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు, ఫ్లూను తొందరగా తగ్గిస్తుంది. 
 

ginger

అల్లం

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అల్లంలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. 
 

Image: Freepik

పసుపు

పసుపులో కర్కుమిన్ తో పాటుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది యాంటీ వైరల్ ఏజెంట్ కూడా. అందుకే పసుపును మీ ఆహారంలో చేర్చడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అంటువ్యాధుల ప్రమాదం కూడా తగ్గిపోతుంది. 
 

బచ్చలికూర

విటమిన్లు, పోషకాల మంచి వనరు బచ్చలికూర. బచ్చలికూర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బచ్చలికూరలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, అమైనో ఆమ్లాలు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
 

గుడ్లు

గుడ్లు పోషకాల భాండాగారం. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ లు ఉంటాయి. గుడ్లలో కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని మీ ఆహారంలో చేర్చడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 

పెరుగు

పెరుగులో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మీ రోగనిరోధక వ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఎండాకాలంలో మజ్జిగ తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. 

Latest Videos

click me!