ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం... కరోనా కూడా ఏమీ చేయలేదు..!

First Published | May 13, 2021, 2:30 PM IST

తులసి, లవంగంతో తయారు చేసే ఓ చిన్న ఔషధంతో ఊపిరితిత్తులను బలంగా చేసుకోవచ్చట. ఆ ఔషధం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంది. ఎక్కువ మంది మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.
వీరిలో ఎక్కుమంది ఊపిరితిత్తుల సమస్యతోనే ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. మరి ఈ కరోనా నుంచి బయటపడాలంటే.. మనం ముందుగా ఊపిరితిత్తులను బలంగా చేసుకోవాలి. అయితే.. దానికి ఆయుర్వేదంలో అతి పెద్ద ఔషధం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఓసారి చూద్దామా..

తులసి, లవంగంతో తయారు చేసే ఓ చిన్న ఔషధంతో ఊపిరితిత్తులను బలంగా చేసుకోవచ్చట. ఆ ఔషధం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కొద్దిగా నల్ల మిరియాలు, లవంగాలను పౌడర్ గా చేసుకోవాలి. ఆ తర్వాత అందులో నాలుగు లేదా ఐదు తులసి ఆకులు వేసి కలిపాలి. దాంట్లో కొద్దిగా పంచదార, ఒక దాల్చిన చెక్క వేయాలి. వీటన్నింటినీ కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ తీసుకోవాలి.
దీనిని రోజూ తీసుకోవడం వల్ల ఆస్తమా రోగులు.. ఆ సమస్య నుంచి బయటపడతారు.
దీనిలో చాలా పోషకాలు ఉన్నాయి. విటమిన్ బి, విటమిన్ ఈ, ఫాస్ఫరస్, కాల్షియం, కోలిన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్, ప్రోటీన్, గ్లైకోలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-బయోటిక్ లక్షణాలతో పాటు ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి.
ఈ పౌడర్ ని రోజుకి 5 గ్రాములు తీసుకుంటే జలుబు,దగ్గు లాంటివి రాకుండా ఉంటాయి.
పవిత్రమైన తులసీ ఆకులలో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కెరోటిన్, విటమిన్ సీ ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రతిరోజూ 4 నుంచి 5 తులసి ఆకులు తీసుకోవడం ఉత్తమం.
లవంగాలలో యూజీనాల్ అనే పదార్ధం ఉంటుంది, ఇది ఒత్తిడి, కడుపు సమస్యలు, పార్కిన్సన్, చెడు నొప్పి వంటి సమస్యలను తొలగిస్తుంది.
లవంగాలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలేట్, రిబోఫ్లేవిన్, విటమిన్ ఎ, థైమిన్ మరియు విటమిన్ డి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇది గుండె, ఊపిరితిత్తులు, కాలేయాన్ని బలపరుస్తుంది . జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
దాల్చిన చెక్కఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి ఉపయోగించవచ్చు. దాల్చినచెక్కలో థైమిన్, భాస్వరం, ప్రోటీన్, సోడియం, విటమిన్లు, కాల్షియం, మాంగనీస్, పొటాషియం, నియాసిన్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి.
దాల్చినచెక్క యాంటీఆక్సిడెంట్లకు బెస్ట్ సోర్స్. ఇవి ఊపిరితిత్తులను, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి... వీటన్నింటితో కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.

Latest Videos

click me!