పెళ్లిలో వధువు అందంగా మెరవాలంటే...

First Published Jun 29, 2020, 2:38 PM IST

సహజంగా అందం పొందాలంటే.. పెళ్లికి ముందే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  రెండు లేదా మూడు నెలల ముందు నుంచే సరైన ఆహారం తీసుకుంటే... పెళ్లిలో ఎంతో అందంగా కనిపించడమే కాకుండా... ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు.

పెళ్లి అమ్మాయిలకు అందమైన కళ. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే.. ఆ పెళ్లిలో అందంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే.. మేకప్ వేసుకొని మరీ రెడీ అయిపోతారు. అయితే... ఎంత మేకప్ ముఖానికి వేసుకున్నా... సహజంగా వచ్చే అందం ముందు అది దిగదొడుపే.
undefined
మరి.. సహజంగా అందం పొందాలంటే.. పెళ్లికి ముందే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రెండు లేదా మూడు నెలల ముందు నుంచే సరైన ఆహారం తీసుకుంటే... పెళ్లిలో ఎంతో అందంగా కనిపించడమే కాకుండా... ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు.
undefined
ఈ మూడు నెలల్లో కొన్ని జాగ్రత్తలను పాటించినట్లయితే ముహూర్తం సమయానికి ఆకర్షణీయంగా, ఉత్సాహంగా కనిపించవచ్చు. మీరు ముఖ్యంగా మూడు విషయాలపై శ్రద్ధ పెట్టాలి - సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర.
undefined
‘వ్యాయామం చేస్తున్నాం కాబట్టి ఆహారం ఎలా తీసుకున్నా ఇబ్బంది ఉండదు’ అనే భ్రమ పనికిరాదు. రోజూ అరలీటరు పాలు లేదా పెరుగు, రెండు కప్పుల కూరగాయలు, రెండు రకాల పళ్ళు, మొలకెత్తిన గింజలు తీసుకోండి.
undefined
కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
undefined
ముఖ్యంగా దానిమ్మ, బొప్పాయి, పుచ్చ, కర్బూజా వంటి పళ్ళను ఎక్కువగా తినాలి. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది.
undefined
వీలున్నంత వరకు అన్నానికి బదులుగా చిరు ధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు మొదలైనవి తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి. ముప్పావుగంట వ్యాయామం తప్పనిసరి.
undefined
వ్యాయామం వల్ల బరువు నియంత్రణలో ఉండడమే కాక చర్మం మంచి మెరుపును సంతరించు కుంటుంది. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.
undefined
సాధారణ టీకి బదులు.. గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం. లేదంటే ఉదయాన్ని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం చాలా మంచిది.
undefined
మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటే... గ్రిల్డ్ ఫిష్, ఒక్క చికెన్ ముక్క తీసుకోవాలి. పెరుగు కూడా ఫ్యాట్ లేకుండా ఉన్నది తీసుకోవడం ఉత్తమం. ఇవన్నీ ఫాలో అయితే.. మేకప్ లేకున్నానూ మీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.
undefined
click me!