కరోనాపై పోరాటం... ఈ ఆహారంతో సాధ్యం..

First Published | Apr 3, 2020, 10:06 AM IST

ఈ వైరస్ సోకిన తర్వాత మందు లేకపోయినా.. ముందు జాగ్రత్తగా రాకుండ మాత్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.  కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఈ వైరస్ రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..

ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్( కోవిడ్-19). చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు భారత్ కి కూడా పాకింది. భారత్ లో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ వైరస్ వ్యాపిస్తూనే ఉంది. చూస్తుండగానే భారత్ లో 2వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. 70కి పైగా ప్రాణాలు కోల్పోయారు.
undefined
ఈ వైరస్ సోకిన వారు తుమ్మినా., దగ్గినా కూడా మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు దీనికి ప్రత్యేకంగా మందు అంటూ ఏదీ కనిపెట్టకపోయినా.. దానిని తగ్గించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
undefined

Latest Videos


అయితే.. ఈ వైరస్ సోకిన తర్వాత మందు లేకపోయినా.. ముందు జాగ్రత్తగా రాకుండ మాత్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఈ వైరస్ రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
undefined
ఆకుకూరలు.. శరీరంలో రోగ నిరోధక శక్తి ని పెంచడానికి విటమిన్ -ఎ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విటమిన్ ఆకుకూరలు, క్యారెట్ లో పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్లలను, శరీరంలోకి దూరిన వైరస్, బ్యాక్టీరియాలను బయటకు నెట్టేయడానికి వ్యాధి నిరోధక వ్యవస్థకు సాయం చేస్తుంది.క్యారెట్లు, ఆకుకూరలు, చిలగడదుంప, బ్రోకోలి, కీరా, మామిడి పండ్లు, కర్బూజా, యాప్రిక్యాట్లలో పుష్కలంగా లభిస్తుంది.
undefined
కమలాలు, ద్రాక్ష.. రక్తంలో యాంటీ బాడీస్ ను, తెల్ల రక్తకణాలను వృద్ధి చేయడంలో విటమిన్-సీ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. కమలాలు, ద్రాక్ష, కివీ పండ్లు, స్ట్రాబెర్రీలు, మిరియాలు, ఉడికించిన క్యాబేజీ తినాలి.
undefined
గుడ్లు, పాలు.. రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లను చంపే ప్రొటీన్ ఉత్పత్తికి విటమిన్-డీ దోహదం చేస్తుంది. ఇది సూర్యరశ్శి నుంచే లభిస్తుంది. ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో సరిపడా ఎండ ఉంటున్నా.. చాలా మందిలో విటమిన్-డి లోపం కనిపిస్తుంది. చేపలు, గుడ్లు, పాలు, చీజ్, వెన్న పన్నీరు, పొట్టగొడుగులు కూడా తినడం మంచిది.
undefined
ధ్రవ పదార్థాలు.. ఈకాలంలో నీరు ఎక్కువగా తాగడం మంచిది, పండ్ల రసాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి.
undefined
వెల్లుల్లి... మనం సాధారణంగా వెల్లుల్లిని వంటల్లో వాడుతూ ఉంటాం. అయితే.. ప్రస్తుతం దీనిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిని పచ్చిగా కానీ, మెత్తగా పేస్టులాగా చేసి గానీ, లేదా ఏదైనా సూప్ చేసుకోని గానీ తాగాలని చెబుతున్నారు. ఇలా వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.
undefined
స్టార్ సోంపు.. దీనిని ఎక్కువగా బిర్యానీలో వాడుతుంటారు. చూడటానికి నక్షత్రంలో ఉండే ఈ మసాలా దినుసు వాడకుండా మనం అసలు బిర్యానీనే చేయరు. అయితే.. దీనిని తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందని చెబుతున్నారు. గ్రీన్ టీలో కానీ, బ్లాక్ టీలో గానీ దీనిని మరిగించి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
undefined
అల్లం.. అల్లం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసిందే. అయితే... ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కచ్చితంగా అల్లం తీసుకోవాలని చెబుతున్నారు. అల్లం రసం తాగడం కానీ.. టీలో అల్లం వేసుకోవడం కానీ చేసి కూడా దీనిని తీసుకోవచ్చు.
undefined
కొబ్బరినూనె.. కొబ్బరి నూనెతో వంటలు చేసుకొని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
undefined
అంతేకాదు పీనట్స్, ద్రాక్ష, రెడ్ వైన్, వైట్ వైన్, బ్లూబెర్రీస్, క్యాన్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ లాంటివి తీసుకోవాలని చెబుతున్నారు. కోకోవా, డార్క్ చాక్లెట్ లాంటివి కూడా మంచివని సూచిస్తున్నారు. అంతేకాకుండా పెప్పర్ కూడా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
undefined
విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. స్వీట్ పొటాటో తీసుకోవడం కూడా చాలా మంచిదని సూచిస్తున్నారు. ఈ ఆహారాలు తీసుకుంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరిగి.. కరోనా దరి చేరకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
undefined
click me!