గుడ్లను ఏ టైంలో తినాలో తెలుసా?

First Published | Nov 5, 2024, 6:18 PM IST

గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ గుడ్డును ఏ టైంలో తింటే మంచిదో తెలుసా? 

గుడ్లు తినడానికి సరైన సమయం

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గుడ్డను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినడం చాలా మంచిది.  ఇది రోజంతా మనల్ని ఎనర్జిటిక్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

గుడ్డులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లతో పాటుగా ఎన్నో ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డును తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అలాగే మీ శరీరం హెల్తీగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. అందుకే డాక్టర్లు రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలని చెప్తుంటారు. 

గుడ్లు తినడానికి సరైన సమయం

కానీ గుడ్లను ఏ టైంలో తింటే మంచిది అని చాలా మందికి తెలియదు. అలాగే గుడ్లను ఎలా తినాలి? ఎవరు తినకూడదు? గుడ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? గుడ్ల వల్ల వచ్చే సమస్యలు ఏంటి అని కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


గుడ్లు తినడానికి సరైన సమయం

గుడ్లలోని పోషకాలు:

గుడ్డు చూడటానికి చిన్నగా ఉన్నా.. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని సంపూర్ణ ఆహారం అంటారు. మీకు తెలుసా? ఉడికించిన గుడ్డులో దాదాపు 77 కేలరీలు ఉంటాయి.

అంతేకాదు దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి5, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ బి6, భాస్వరం, సెలీనియం, కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మెండుగా ఉంటాయి. గుడ్లు ప్రోటీన్ కు మంచి మనరు అన్న సంగతి అందరికీ తెలుసు. దీంట్లో గుండెను ఆరోగ్యంగా ఉంచే అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. 

గుడ్లు తినడానికి సరైన సమయం

గుడ్లు తినడానికి ఉత్తమ సమయం ఏంటి?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గుడ్ల నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందాలంటే మాత్రం వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తినడం మంచిది.

ఇది మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. అలాగే రోజంతా మీ కడుపును సంతృప్తిగా ఉంచుతుంది. అంతేకాదు ఉదయం మీ జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. కాబట్టి ఉదయాన్నే గుడ్డును తింటే.. దీనిలోని ప్రోటీన్లను, ఎన్నో పోషకాలను జీర్ణవ్యవస్థ సులువుగా  విచ్ఛిన్నం చేస్తుంది. 

బరువు తగ్గడానికి గుడ్లు ఎలా తినాలి?

బరువు తగ్గాలనుకునేవారికి కూడా గుడ్లు బాగా సహాయపడతాయి. ఇందుకోసం ఉడికించిన గుడ్లను తినాలి. ఎందుకంటే తక్కువ వేడి మీద గుడ్డును ఉడికించి తింటే కొలెస్ట్రాల్ ఆక్సీకరణ తగ్గుతుంది.

అలాగే గుడ్డులోని పోషకాలు చాలా వరకు అలాగే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఉడికించిన గుడ్లను తింటేనే మంచిది. ఇదొక్కటి ఉడికించిన గుడ్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. 

గుడ్లు తినడానికి సరైన సమయం

గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు

గుడ్లలో మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి. గుడ్లు మీరు బరువు తగ్గడానికి, బరువు పెరగకుండా ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి బాగా సహాయపడుతుంది.

అంతేకాదు గుడ్లు మన ఎముకలను బలంగా ఉంచడానికి, కణాలు దెబ్బతినకుండా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. అతేకాదు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

అయితే కొంతమందికి గుడ్లను తింటే కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుడ్డును పచ్చిగా తినడం లేదా సగం ఉడికించిన గుడ్డును తింటే మరిన్ని సమస్యలు వస్తాయి.

అందుకే గుడ్డును బాగా ఉడికించిన తర్వాతే తినాలి.  కొంతమందికి దీన్ని తింటే అలెర్జీ వస్తుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని, ముఖం, గొంతు వాపు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. అంతేకాదు గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. 

Latest Videos

click me!