ఖర్జూరాలను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 5, 2024, 12:00 PM IST

ఆరోగ్యకరమైన ఆహారమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే హెల్తీగా ఉండేందుకు మనం ఎన్నో రకాల ఆహారాలను తింటుంటాం. ఇలాంటి వాటిలో ఖర్జూరాలు ఒకటి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా? 

ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఇతర అనారోగ్యకరమైన తీపి ఆహారాలపై ఇష్టం తగ్గుతుంది. అనవసరమైన ఆహారాలను తినకుండా ఉంటారు. అలాగే మన శరీరానికి మంచి శక్తి అందుతుంది. 

మీకు తెలుసా? ఖర్జూరాల్లో కాల్షియం, ఐరన్, మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా తినే వారున్నారు. ఇతర డ్రై ఫ్రూట్స్ తో పాటుగా ఖర్జూరాలను తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే ఈ ఖర్జూరాలను ప్రతిరోజూ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రక్త నష్టాన్ని తొలగిస్తుంది

ఖర్జూరాలు ఐరన్ కు మంచి వనరులు. వీటిని రోజూ తింటే మీ శరీరంలో ఐరన్ లోపం ఉండదు. మీకు తెలుసా? ఐరన్ లోపం మగవారి కంటే  ఆడవారికే ఎక్కువగా ఉంటుంది. వీరి శరీరంలోనే రక్తం తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తం తక్కువగా ఉంటే రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఆడవాళ్లు రోజూ ఒక ఖర్జూరం తింటే రక్తానికి లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు కూడా రావు. 

Latest Videos


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది 

ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అంటే ఖర్జూరాలను రోజూ తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఖర్జూరాలను రోజూ తింటే పైల్స్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. 

ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి

ఖర్జూరాల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్ని మన ఎముకల్ని, దంతాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. రోజూ ఖర్జూరాలను తింటే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. వీటికి సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 


అధిక రక్తపోటు నుంచి ఉపశమనం 

అధిక రక్తపోటు ప్రాణాలకు చాలా ప్రమాదం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఖర్జూరాలు హై బీపీని నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. ఖర్జూరాల్లో ఉండే పొటాషియం, ఇతర పోషకాలు బీపీని కంట్రోల్ చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. వీటిని రోజూ తినడం వల్ల హైపర్  టెన్షన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. 

గుండెకు మేలు చేస్తుంది

ఖర్జూరాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఖర్జూరాల్లో గుండెను ఆరోగ్యంగా ఉంచే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మీరు ఈ ఖర్జూరాలను రోజూ తింటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది. దీంతో మీ గుండె  ఆరోగ్యంగా ఉంటుంది. 


మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది

ఖర్జూరాలు మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. రోజూ ఖర్జూరాలను తినడం వల్ల మీ మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఉండే విటమిన్-బి, కోలిన్ మీ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. 

సలహా

ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎన్నివిధాలుగా మేలు చేసినా.. వీటిని రోజుకు 3-4 ఖర్జూరాలకు మించి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని నీళ్లు లేదా పాలలో నానబెట్టి తింటే మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. 

click me!