మంచిది కదా అని కీరదోస ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 23, 2024, 12:13 PM IST

మరీ ఎక్కువగా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంంటో ఓసారి చూద్దాం...

cucumber

బయట ఎండలు మండుతున్నాయి. రెండు రోజులు ఏదో వర్షం పడినట్లు అనిపించినా.. మళ్లీ ఎండలు షరా మామూలే అంటూ మండిపోతున్నాయి. ఈ ఎండల్లో మనకు కాస్త ఊరటనిచ్చేలా పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చెరకు రసం, కీర దోస తినడం లాంటివి చేస్తూ ఉంటాం. ఎక్కువ మంది కీరదోస తినడానికి ఇష్టపడతారు. 

cucumber


కీరదోస ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. దీనిలో ఉన్న కూలింగ్ ఫ్యాక్టర్స్.. శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న కీరదోసను కూడా రోజూ తినకూడదట. మరీ ఎక్కువగా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంంటో ఓసారి చూద్దాం...

Latest Videos


మరీ ఎక్కువ కీరదోస తినడం వల్ల ఎక్కువగా కడుపునొప్పి వస్తుంది. బ్లోటింగ్ సమస్య కూడా ఉంటుంది. కీరదోస లో ఉండే అధిక ఫైబర్  కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది.

అంతేకాదు.. కీరదోస ఎక్కువగా తినడం వల్ల..శరీరంలోని ఫ్యూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. దాని వల్ల.. ఊరికూరికే యూరిన్ కి వెళ్లాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది.
 

కీరదోసలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కానీ.. ఎక్కువగా తినడం వల్ల  న్యూటియంట్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు.. వీటిని ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డయేరియా వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.
 


కొందరికి అయితే.. కీరదోస ఎక్కువగా తినడం వల్ల చర్మంపై అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్య వచ్చిన వారు అయితే.. దీనికి దూరంగా ఉండటమే మంచిది.
 

మీరు నమ్మరు కానీ.. కీరదోస ను విపరీతంగా ఎక్కువగా తినడం వల్ల.. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఇక మార్కెట్లో లభించే అన్ని కీరదోసలు ఆర్గానిక్ అయ్యి ఉండకపోవచ్చు. కొన్ని కెమికల్స్ తో కూడా ఉంటాయి. కాబట్టి. ఎంత కడిగినా ఆ కెమికల్స్  పోవు. అలాంటి సమయంలో.. కూడా కీరదోస తిన్నప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. వీటిని తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

click me!