కొత్తిమీర మన ఆరోగ్యానికి ఇంత మంచి చేస్తుందా?

First Published | Jun 20, 2023, 12:02 PM IST

కొత్తిమీర మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని రోజూ తింటే ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

ప్రతి వంటలో కొత్తిమీరను ఖచ్చితంగా వేస్తుంటారు. కొత్తిమీర టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి 100 గ్రాముల కొత్తిమీరలో 31 కేలరీలు ఉంటాయి. ఇందులో 4 గ్రాముల ప్రోటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 146 మిల్లీగ్రాముల కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి లు ఉంటాయి. అంతే కాకుండా దీనిలో మన జీవక్రియకు సహాయపడే ఎంజైమ్లు కూడా ఉంటాయి. అసలు కొత్తిమీరను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు 

కొత్తిమీరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మన కణాలు, కణజాలాలకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే నొప్పిని తగ్గిస్తుంది. అంతకాదు ఇది శరీరంలోని ఎన్నో భాగాల్లో వాపును తగ్గిస్తుంది.
 


Coriander Leaves

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

కొత్తిమీర  కొలెస్ట్రాల్ ను తగ్గించి ధమనులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కొత్తిమీర గుండె సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ తో పోరాడుతున్న వారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
 

ఉబ్బరాన్ని నివారిస్తుంది

కడుపు ఉబ్బరం చాలా మందిని వేధించే సాధారణ సమస్య. ఈ సమస్య ఉన్నవారికి కొత్తిమీర ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడానికి, కడుపు కదలికలను సరిచేయడానికి సహాయపడే కొన్ని ఎంజైమ్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిలోని ఎంజైమ్లు ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి. దీని వల్ల ఉబ్బరం సమస్య ఉండదు.
 

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే కొత్తిమీర ఆందోళనను, ఒత్తిడిని తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది బ్రెయిన్ బూస్టర్ తో పాటు జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ సమస్యలను తగ్గించడానికి పచ్చి కొత్తిమీరను తినాలి. 

Latest Videos

click me!