చెర్రీ పండ్లలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెడ్ పండ్లలో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ తో పాటుగా గుండెను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలె మొక్కల సమ్మేళనాలు ఆంథోసైనిన్స్ కూడా ఉంటాయి. ఇవి మన గుండెకు చాలా మంచివి. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చెర్రీలు రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి.
చెర్రీల్లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తుంది. ఇక దీనిలో పొటాషియం సరైన గుండె పనితీరుకు, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇక దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.
చెర్రీలో ఆంథోసైనిన్ అనే సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి బలమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. చెర్రీ జ్యూస్ పే తాగితే బాగా నిద్రపడుతుంది. ఇది నిద్రలేమి వంటి నిద్ర సమస్యలను నియంత్రించడానికి సహాయపడుతుంది. చెర్రీలు వ్యాయామం తర్వాత కండరాల నొప్పులను, వాపును తగ్గించడానికి సహాయపడతాయి.
చెర్రీలో ఆంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్లతో సహా గుండె-ఆరోగ్యకరమైన సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీర మంట, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చెర్రీలో ఫైబర్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చెర్రీలను తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. అలాగే పేగు కదలికలు మెరుగుపడతాయి. ఈ పండ్లు మొత్తం గట్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
cherry
చెర్రీ పండ్లలో ఉండే ఆంథోసైనిన్స్ మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి, అల్జీమర్స్ వంటి వయస్సు-సంబంధిత న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి.