ఈ ఎర్ర తోటకూరలో విటమిన్లు E, C, K పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. ఈ ఆకుకూరలో ఐరన్, కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే.. ఈ ఆకు కూరను పవర్ హౌస్ అని చెప్పొచ్చు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, మొత్తం ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ని పోషకాలు, విటమిన్లు ఉన్న ఈ ఆకుకూరను తినడం వల్ల.. ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.