మెంతులు టేస్ట్ లో చేదుగా ఉంటాయి. కానీ వీటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికే కాకుండా.. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటితో చేసిన పేస్ట్ జుట్టుకు, ముఖానికి పెడుతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీటిని మొలకలుగా కూడా తినొచన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. అవును మొలకెత్తిన మెంతులను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మొలకల్లో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.