చపాతీలపై నెయ్యి వేసుకుని తింటే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Jun 23, 2024, 3:44 PM IST

నెయ్యి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజుకు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. అయితే ఈ నెయ్యిని చపాతీతో తింటే ఏమౌతుందో తెలుసా? 

మనలో చాలా మంది అన్నానికి బదులుగా చపాతీ లేదా నెయ్యితో చేసిన రోటీ నే ఎక్కువగా తింటుంటారు. నెయ్యి చపాతీని మెత్తగా చేయడమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. నెయ్యిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన ఎముకలను, కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచతాయి. అసలు చపాతీపై నెయ్యిని వేసుకుని తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

రక్తంలో చక్కెర స్థాయిలు


రోటీ లేదా చపాతీలో కొద్ది మొత్తంలో పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కానీ నెయ్యిలో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా చేయడానికి సహాయపడతాయి. అందుకే మధుమేహులు చపాతీలో నెయ్యిని వేసుకుని తినాలని చెప్తుంటారు. 
 


ghee on roti

పోషకాల శోషణ

గోధుమ పిండిలో ఉన్న కొవ్వులో కరిగే విటమిన్లు, ఖనిజాలను బాగా గ్రహించడానికి నెయ్యి బాగా సహాయపడుతుంది. అందుకే చపాతీపై నెయ్యిని వేసుకుని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

బరువు తగ్గడానికి 

బరువు తగ్గాలనుకునే వారికి నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చపాతీపై నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఇందుకోసం చపాతీపై నెయ్యిని రాసుకుని తినండి.

Latest Videos

click me!