మీరు అన్నం తిన్నా సరే, దానిని సమతులంగా ఉంచుకోవడం ముఖ్యమని, అన్నం ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అన్నం ఎప్పుడూ ప్రొటీన్ వెజిటేబుల్స్ ,సలాడ్ తో తినాలి. అన్నం కంటే ఎక్కువ మోతాదులో కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇది కాకుండా, మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ఇది డయాబెటిస్ అవకాశాలను తగ్గిస్తుంది. మీకు అన్నం ఇష్టమైతే బ్రౌన్ రైస్ తినవచ్చు, ఇది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.