okra water
పురుషులు 30 ఏళ్లు దాటారు అంటే... వారి జీవితంలో ముఖ్యమైన మైల్ స్టోన్ దాటినట్లే. నిజానికి 30 దాటిన తర్వాత స్త్రీలకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ చెబుతూ ఉంటారు. కానీ... 30 దాటిన తర్వాత.. స్త్రీల ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో... పురుషులు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి.
పురుషుల్లోనూ 30 దాటిన దగ్గర నుంచి అనారోగ్య సమస్యలు రావడం మొదలౌతుందట. అందుకే..అవి మరీ ఎక్కువ కాకముందే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తపడాలట. కచ్చితంగా.. ప్రతిరోజూ పురుషులు ఓ డ్రింక్ తాగాలి అదేంటో కాదు.. బెండకాయ నీళ్లు. బెండకాయతో కూర తింటారు కానీ.. ఈ నీళ్లు తాగడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ.. ఈ బెండకాయ నీరు తాగడం వల్ల పురుషులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయట.
బెండకాయ అద్భుతమైన రుచిలోనే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలతో నిండి ఉంటుంది. డయాబెటిస్ లేదా క్యాన్సర్ ఉన్నవారికి ఇది ఒక వరం. కాబట్టే ఇది 'సూపర్‌ఫుడ్' అని ప్రసిద్ధి చెందింది. బెండకాయలో పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఉన్నాయి. దీంట్లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది.
okra water
బెండకాయ నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతున్నాయని తేలింది. అంతేకాదు టర్కీలో యేళ్లుగా మధుమేహ చికిత్సలో కాల్చిన బెండకాయ విత్తనాలను ఔషధంగా వాడుతున్నారని పరిశోధనలో తేలింది.
okra water
హై ఫైబర్ : బెండకాయ అనేది ఎక్కువ ఫైబర్ కంటెంట్ కలిగిన కూరగాయ, ఇది డయాబెటిస్ చికిత్సలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణశయాంతర ప్రేగు నుండి శోషించబడే రేటును తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించే అధిక ఫైబర్ కంటెంట్ ఉన్నందున దీనిని యాంటీ-డయాబెటిక్ ఫుడ్ గా పేరు పెట్టారు. ఇది మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఈ డైటరీ కంటెంట్ డయాబెటిస్‌లో సహాయపడటమే కాకుండా, అజీర్ణం, క్రేవింగ్స్ తగ్గించి... ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న భావనను కలిగించడం వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
యాంటీఆక్సిడెంట్స్ : శరీరంలో ఒత్తిడి స్థాయిని తగ్గించే యాంటీఆక్సిడెంట్లు కూడా బెండకాయలో పుష్కలంగా ఉన్నాయి. డయాబెటిస్‌ను మేనేజ్ చేయడం అంటే మనం ఏం తింటున్నాం అనే విషయంలో జాగ్రత్త తీసుకోవడం మాత్రమే కాదు.. పూర్తిగా జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఒత్తడిని కంట్రోల్ లో పెట్టుకోవడం వల్ల మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలిక ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతుంది : మధుమేహం ఉన్నవారికి అధిక కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. అందువల్ల, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇది మధుమేహ సమస్యలను తగ్గించడానికి, చక్కటి ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం.
ఈ బెండకాయ నీళ్లు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా.. రెండు, మూడు బెండకాయలను తీసుకొని వాటిని మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ముక్కలుగా కోసుకోవాలి. ఆ కోసిన ముక్కలను.. ఓ గ్లాసులో వేసి.. ఆ గ్లాసు నిండా నీరుపోయాలి. రాత్రంతా ఆ నీటిని పక్కన పెట్టేయాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. అంతే.. అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.