వీళ్లు జామకాయ అస్సలు తినకూడదు, ఎందుకో తెలుసా?

First Published | Nov 7, 2024, 2:25 PM IST

ఈ పండు వల్ల కలిగే నష్టాలు తెలీకుండా తింటే.. ఆరోగ్య సమస్యలుు వచ్చే ప్రమాదం ఉంది. మరి, ఈ పండు తింటే కలిగే లాభాలు, నష్టాలు ఏంటో తెలుసుకుందాం….

guava

చలికాలంలో ఈజీగా లభించే పండ్లలో జామకాయ ముందు వరసలో ఉంటుంది. ఈ పండులో పోషక గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఈ పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో, అంతే నష్టం కూడా కలిగిస్తుందట. అందుకే.. జామపండును మీరు డైట్ లో భాగం చేసుకోవడానికి ముందు ఈ పండు గురించి కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలట. ఎందుకంటే… ఈ పండు వల్ల కలిగే నష్టాలు తెలీకుండా తింటే.. ఆరోగ్య సమస్యలుు వచ్చే ప్రమాదం ఉంది. మరి, ఈ పండు తింటే కలిగే లాభాలు, నష్టాలు ఏంటో తెలుసుకుందాం….

జామకాయ తినడం వల్ల ప్రయోజనాలు…

జామకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  ఎందుకంటే దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల మలబద్దకం సమస్య అనేది ఉండదు. జీర్ణ క్రియకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ జామకాయలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. 


విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జామకాయలో కరిగే ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. రక్తంలోని చెక్కర స్థాయిని నిర్వహించడంలో, కొలిస్ట్రాల్ తగ్గించడంలోనూ ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది. వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది. కంటి చూపు మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. మెదడు చురుకుగా పని చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

మరి, జామకాయ తినడం వల్ల కలిగే నష్టాలు…

జామకాయ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  వీటిని తినకూడదట.  జామ కాయలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదే కానీ వీటిని ఎక్కువగా తింటే గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటివి వస్తాయి. జామపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.

జామపండు తింటే కొందరికి అలర్జీ రావచ్చు. అయితే, ఇది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. మీరు ఏదైనా ఔషధం తీసుకుంటుంటే, జామపండు తీసుకోవడం వల్ల ఔషధం శోషణకు ఆటంకం కలుగుతుంది. అందుకే ఒకసారి డాక్టర్‌ని సంప్రదించండి.

జామకాయ ఎలా తినాలో తెలుసా?

జామకాయ తినడం వల్ల పెద్దగా హాని ఉండదు. దీని వల్ల కలిగే దుష్ప్రభావాలు సాధారణం కాదు. చాలా అరుదుగా కనిపిస్తాయి. మీరు దానిని కట్ చేసి ఉప్పుతో తినవచ్చు లేదా సలాడ్, స్మూతీ,జ్యూస్ రూపంలో తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

Latest Videos

click me!