ash gourd juice
నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో దాదాపు మనం అందరం బ్యాడ్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నవాళ్లమే. ఆరోగ్యకరమైన ఆహారం తినడం లేదు, శారీరక శ్రమ అంతకన్నా ఉండటం లేదు. ఈ క్రమంలోనే వెంట వెంటనే జబ్బుల బారినపడుతున్నారు. లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతోంది. వీటి నుంచి మనం బయటపడాలంటే.. మంచి పండ్లు, కూరగాయలపై ఆధారపడాల్సి ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిలో బూడిద గుమ్మడికాయ ముందు వరసలో ఉంటుంది. ఆరోగ్యం కోసం రోజూ పండ్లు, కూరగాయలు తమ డైట్ లో భాగం చేసుకనేవారు చాలా మంది ఉంటారు. కానీ.. బూడిద గుమ్మడికాయ తొందరగా ఎవరూ తినరు. కానీ.. దీనిని కనుక డైట్ లో భాగం చేసుకుంటే.. మనం ఊహించని చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు. మరి.. ఆ ఉపయోగాలేంటో చూద్దాం..
Ash Gourd
బూడిద గుమ్మడికాయలో గ్యాస్ట్రో ప్రొటెక్టివ్, ఫైబర్, యాంటీ ఒబేసిటీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. వీటిని డైట్ లో తీసుకోవడం వల్ల.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ రోజుల్లో ఒత్తిడి లేనివాళ్లు ఎవరూ లేరనే చెప్పాలి. ఆఫీసు ఒత్తిడి, మనీ ప్రాబ్లం ఇలా కారణాలు ఏదైనా ఒత్తిడి వచ్చేస్తోంది. ఇది చాలా డేంజర్. కానీ.. ఆ ఒత్తిడిని ఈ గుమ్మడికాయ తగ్గిచేస్తుంది. అంతేకాదు.. ఈ జ్యూస్ మనకు శక్తిని ఇస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేయడంలోనూ సహాయం చేస్తుంది.
Ash gourd juice
ఎవరికైనా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే.. వారు కూడా ఈ గుమ్మడికాయను తీసుకోవచ్చు. గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నా కూడా కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా.. ఆ రాళ్లు కరిగిపోతాయి.
అంతేకాదు గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అరుగుదల సమస్యలు ఏమైనా ఉన్నా, మలబద్దకం సమస్య ఉన్నా.. ఈ గుమ్మడికాయను తీసుకోవడం వల్ల… ఆ సమస్యలు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.
Ash Gourd
అంతేకాకుండా.. మీరు బూడిద గుమ్మడికాయ ను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ గుమ్మడికాయ జ్యూస్ రోజూ తాగితే.. శరీరంలో ఫ్యాట్ కరిగించడంలో సహాయం చేస్తుంది. మెటబాలిజం కూడా ఇంప్రూవ్ చేస్తుంది.
Drink ash gourd juice and lose weight
దీనిని ఎలా తీసుకోవాలి అంటే.. గుమ్మడికాయ తొక్క మొత్తం తీసేయాలి. ఆ తర్వాత.. గుమ్మడికాయ ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను మిక్సర్ లో వేసి.. జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దానిని ఒక క్లాత్ లో వేసి.. వడకొట్టుకోవాలి. అంతే.. రోజూ ఉదయం ఈ జ్యూస్ తాగితే సరిపోతుంది.