barley
సమ్మర్ లో ఎండలు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ ఎండల వేడిని తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. మనకు కూడా లోపల వేడి చేస్తూ ఉంటుంది. కడుపులో మంట పుట్టడం, యూరిన్ కి వెళ్లినా మంట పుట్టడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మనం ఎక్కువగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉంటాం. అయితే... వాటి స్థానంలో మనం బార్లీ వాటర్ కూడా తాగుతూ ఉండాలి. అసలు ఎండాకాలం బార్లీ వాటర్ ఎందుకు తాగుతూ ఉండాలి..? దాని వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం..
barley
బార్లీ వాటర్ మనకు రిఫ్రెషింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. బార్లీ గింజలను నీటిలో మరిగించడం వల్ల బార్లీ వాటర్ తయారౌతుంది. దీనిలో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచే ప్రాపర్టీలు చాలా ఉంటాయి. మనకు ఎండల్లో చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. దాని వల్ల శరీరం వెంటనే నిర్జలీకరణం అవుతూ ఉంటుంది. అలా కాకుండా.. బార్లీ గింజల వాటర్ తాగడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. డీ హైడ్రేషన్ కారణంగా వచ్చే.. అనేక ఆరోగ్య సమస్యలను బార్లీ వాటర్ తాగడం వల్ల తగ్గుతాయి.
barley
బార్లీ వాటర్ లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బి1, బి3, బి6, సీ వంటి విటమిన్లు, మెగ్నీషియం, పాస్పరస్, ఐరన్ లు.. మొత్తం ఆరోగ్యానికి సహాయం చేస్తాయి.
barley
ఇక..ఈ ఎండాకాలం చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. తిన్న ఆహారం సరిగా జీర్ణమవ్వదు. అలాంటివారు కనుక రోజూ ఒక గ్లాసు బార్లీ వాటర్ తాగాలి. అప్పుడు వారికి ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. స్టమక్ అప్ సెట్ అయినప్పుడు ఈ వాటర్ తాగినా.. చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి.
barley
మీరు నమ్మసక్యంగా అనిపించకపోయినా... బార్లీ వాటర్ తాగడం వల్ల.. మీ బరువును కూడా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకునేవారు.. రోజూ మధ్యాహ్నం సమయంలో ఈ వాటర్ తాగాలి. కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. క్యాలరీ ఇన్ టేక్ ని తగ్గిస్తుంది.
barley water
బార్లీ వాటర్ ని తాగడం వల్ల మన బాడీ నేచురల్ గా డీ టాక్సిఫై చేస్తుంది. బాడీ నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లేలా చేస్తుంది. కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా జరిగేలా చేస్తుంది. యూరినరీ సంబంధింత సమస్యలు ఏవైనా వెంటనే తగ్గిపోతాయి.
barley water
షుగర్ సమస్యతో బాధపడేవారు సైతం బార్లీ వాటర్ హ్యాపీగా తాగొచ్చు. ఇది కూడా బాడీలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. రెగ్యులర్ గా తాగడం వల్ల షుగర్ పేషెంట్స్ కి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు.. రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది.