కాకరకాయ.. ఈ పేరు వినగానే కొందరు ఆమడదూరం పారిపోతే.. మరికొందరు లొట్టలు వేసుకుంటూ లాగించేస్తారు. ఈ ఇష్టాయిష్టాలకు దాని చేదే ప్రధాన కారణం.
undefined
కాకరకాయ చేదుగా ఉన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తాజాగా అందాన్ని పెంచడానికి కూడా కాకరకాయ భలేగా పనిచేస్తోందని అంటున్నారు బ్యూటీ నిపుణులు.
undefined
ఎంత వయసొచ్చిన తొలి యవ్వనం నాటి అందంతో కనిపించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కనీసం వయసు మీదపడుతున్న లక్షణాలు కనిపించకుండా ఉండాలని తాపత్రయపడతారు. అయితే కాకరకాయ బెస్ట్.
undefined
కాకరకాయలో యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వయసును కనిపించనీయకుండా చేసే విటమిన్ సి ఈ చేదు కాకరకాయలో ఎక్కువగా ఉంటుంది.
undefined
రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాకరకాయలో ఎక్కువ మోతాదులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసి, చర్మాన్ని ఆరోగ్యవంతంగా మెరిసిపోయేలా చేస్తాయి.
undefined
కాకరకాయ రసం మొహాన్ని మెరిపిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కాకరకాయ రసంలో రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్ కలిపి దూదితో మొహాన్నికంతా పెట్టుకుని, ఆరిన తరువాత కడుక్కుంటే తళతళలాడే నిగారింపు మీ సొంతమవుతుంది.

తరచుగా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే రోజూ ఉదయాన్నే కాకరకాయం రసం తాగాలి. దీంట్లోని యాంటీ బ్లాక్టీరియల్ లక్షణాలు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
undefined
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల కాకరకాయ చర్మానికి ఎంతో మంచిది.
undefined
జుట్టు ఒత్తుగా, పట్టుకుచ్చుల్లా మెరిసిపోవాలంటే కాకరకాయ బెస్ట్ ఆఫ్షన్. సగం కప్పు కాకరకాయ రసంలో 5 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి జుట్టుకు పట్టించాలి. ఇది ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి.
undefined
చుండ్రును తొలగిస్తుంది.. కాకరకాయ రసాన్ని నీటిలో కలిసి వారానికి ఒకసారి జుట్టును వాష్ చేసుకోండి. ఇలా తరచుగా చేస్తుంటే చుండ్రు బాధ నుంచి విముక్తి లభిస్తుంది.
undefined
డ్రై స్కాల్ప్ సమస్యను నివారిస్తుంది. కాకరకాయ రసాన్ని కొబ్బరినూనెతో కలిపి మాడుకు బాగా రాసి కాసేపటి తరువాత షాంపూతో స్నానం చేస్తే డ్రై స్కాల్ప్ సమస్య తీరిపోతుంది.
undefined
డ్రై స్కాల్ప్ సమస్యను నివారిస్తుంది. కాకరకాయ రసాన్ని కొబ్బరినూనెతో కలిపి మాడుకు బాగా రాసి కాసేపటి తరువాత షాంపూతో స్నానం చేస్తే డ్రై స్కాల్ప్ సమస్య తీరిపోతుంది.
undefined