Mangoes: కెమికల్స్ తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?

Published : Apr 10, 2026, 03:33 PM IST

Mangoes: మార్కెట్లో మామిడి పండ్ల హవా మొదలైంది. చూడగానే నోరూరేలా కనిపిస్తూ ఉంటాయి. మరి, మార్కెట్లో కనిపించే ఈ పండ్లు సహజంగా పండినవా లేక.. కెమికల్స్ తో పండించినవా? తెలుసుకునేదెలా? 

PREV
13
Mango

ఎండాకాల రాగానే, మార్కెట్లలో మామిడి పండ్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు, ప్రతి ఒక్కరూ ఈ పండు ఎప్పుడు తినాలా అని తహతహలాడిపోతూ ఉంటారు. చాలా మంది కేవలం మామిడి పండ్ల కోసం సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ, మార్కెట్లో దొరికే అన్ని మామిడి పండ్లు.. సహజంగా పండినవి కావు. మన కళ్లకు ఆకర్షణీయంగా కనిపించేలా ఈ పండ్లను రసాయనాలతో తొందరగా పండేలా చేస్తారు. ఇలాంటివి తినడం వల్ల మీ ఆరోగ్యానికి సమస్యలు రావచ్చు. మరి... కెమికల్స్ తో పండిన పండ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

23
1.సువాసన...

మీరు మామిడి పండ్లను కొనుగోలు చేయాలి అనుకుంటే.. రసాయనాలు లేని పండ్లను ఎంచుకోండి. కేవలం నేచురల్ గా పండిన పండ్లు మాత్రమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ రెండింటికీ తేడాను సువాసన ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. సహజంగా పండిన మామిడి పండ్ల నుంచి తియ్యటి వాసన వస్తుంది.

2.రంగు...

రంగును బట్టి కూడా మీరు సహజంగా పండిన పండ్లను గుర్తించొచ్చు. సహజంగా పండిన మామిడి పండ్లు పూర్తిగా పసుపు రంగులో ఉంటాయి. అయితే, రసాయనాలతో పండిన పండ్లు.. ప్రకాశవంతమైన రంగులో కనిపిస్తాయి. కాబట్టి, మీరు సులభంగా రంగు చూసి గుర్తుపట్టొచ్చు.

33
3.మచ్చలు, గుర్తులు...

మచ్చలు, గుర్తులను చూడటం ద్వారా కూడా మీరు మామిడి పండును సులభంగా గుర్తించొచ్చు. మామిడి పండుపై చాలా మచ్చలు లేదా గుర్తులు ఉంటే.. అది రసాయనాలతో లేదా ఇంజెక్షన్ ద్వారా పండించినది అయ్యే అవకాశం ఉంది. అలా లేని మామిడి పండ్లను మీరు గుర్తించాలి.

4. నొక్కి పరీక్షించడం

మామిడి పండును నొక్కి పరీక్షించడం ద్వారా మీరు రియల్ మామిడి పండును గుర్తించొచ్చు. మామిడి పండ్లను నొక్కినప్పుడు మృదువుగా లేదా గుజ్జుగా అనిపిస్తాయి. సహజంగా పండిన మామిడి పండ్లు ఇలా ఉండవు.

5. బేకింగ్ సోడా పరీక్ష

మామిడి పండ్లను సరిగ్గా పరీక్షించాలంటే, వాటన్నింటినీ బేకింగ్ సోడా నీటితో క్షుణ్ణంగా కడగాలి. కడిగిన తర్వాత వాటి రంగు వింతగా మారడం మొదలైతే, రసాయనాలతో పండించిన మామిడి పండ్లు అని మీరు అర్థం చేసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories