ఆక్వాఫాబా...ఇంట్లోనే ఈజీగా రెడీ..ఇక ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే షాకింగే..

First Published | Jun 25, 2021, 3:46 PM IST

కాబూలీ శనగలు లేదా పెద్ద శనగలు.. ఎక్కువగా చపాతీ కూరగానో, వెజ్ వంటకాల్లో మిక్స్ చేయడానికో.. లేదా ఏదైనా పండగలు, వ్రతాలు, నోములకు వాయినం ఇవ్వడానికి ఎక్కువగా వాడుతుంటారు. 

కాబూలీ శనగలు లేదా పెద్ద శనగలు.. ఎక్కువగా చపాతీ కూరగానో, వెజ్ వంటకాల్లో మిక్స్ చేయడానికో.. లేదా ఏదైనా పండగలు, వ్రతాలు, నోములకు వాయినం ఇవ్వడానికి ఎక్కువగా వాడుతుంటారు.
అయితే వీటిని నానబెట్టిన లేదా ఉడికించిన తరువాత ఆ నీటిని ఏం చేస్తారు? ఏముంది.. పారబోయడమే అంటారా? చాలామంది అదే చేస్తారు. అయితే ఈ నీటిలో అనేక పోషకాలుంటాయి. గుడ్డులోని తెల్లసొనలో ఉండే పోషకాలు ఈ నీటిలో ఉంటాయి.

ఈ నీటిని మయోనైజ్, మెరింగ్యూ తయారీకి ఉపయోగిస్తారు. దీన్ని ఎలా తయారు చేయాలో, దాంట్లోని ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.. తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే...దీన్ని ఆక్వాఫాబా అంటారు.
ఆక్వాఫాబా తయారు చేయడం ఎలా అంటే... దీనికోసం పెద్దగా కష్టపడనక్కరలేదు.. చిక్‌పీస్‌ను 4-7 గంటలు నానబెట్టి, తరువాత నీటిని వడకట్టాలి. ఇదే ఆక్వాఫాబా. ఈ వడకట్టిన నీటితోనే శనగలు ఉడికించొచ్చు. ఈ రెండింట్లోనూ పోషకాలు సమానంగా ఉంటాయి.
ఆక్వాబాబా ఆరోగ్య ప్రయోజనాలు... నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిక్‌పీస్‌ను నానబెట్టినప్పుడు లేదా ఉడకబెట్టినప్పుడు, కొన్ని పోషకాలు నీటిలోకి వస్తాయి. ఈ నీటిలో విటమిన్ బి, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, లినోలెయిక్, ఒలేయిక్ ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి.
దీన్ని తెల్లసొనకు ప్రత్యామ్నాయంగా చెబుతారు. ఈ ద్రవాన్ని చిలికినప్పుడు తెల్లసొనను విస్క్ చేస్తే వచ్చేలాంటి నురగ వస్తుంది. శాకాహార వంటకాల్లో గుడ్డుకు బదులుగా ఎక్కువగా ఈ నీటిని వాడతారు.
గుడ్డులోని తెల్లసొనలో ఉండే అన్ని పోషకాలూ ఇందులో ఉంటాయి. దీంతోపాటు బాలెన్స్ డ్ ప్రోటీన్, పిండి పదార్ధాలు ఉంటాయి. మయోన్నైస్ చేయడానికి లేదా ఎగ్ అలెర్జీ ఉన్నవారికి చేసే వంటకాల్లో దీన్ని వాడతారు.
దీన్ని వీగన్ డైరీ ప్రత్యామ్నాయంగా వాడతాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఈ ద్రవాన్ని బేకింగ్ వంటకాలకు పాలు లేదా వెన్న ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించవచ్చు.

Latest Videos

click me!