ఐస్ క్రీం తినడానికి కాలంతో సంబంధం లేదు. వేసవిలోనే తినాలనే రూల్ లేదు. జోరుగా వర్షం పడుతుంటే ఐస్ క్రీం తినడం ఓ గమ్మత్తైన అనుభవం.. ఓ వైపు చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంటే చల్లటి ఐస్ క్రీం తినేయాలని అనుకునేవారు కూడా ఉంటారు. అందుకే ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఐస్ క్రీంలు అందుబాటులో ఉన్నాయి.
వీటిల్లో ఫ్రూట్స్ తో చేసేవి, ఆర్గానిక్ ఐస్ క్రీంలు.. ఇలా అనేక రకాలు, అనేక బ్రాండ్లు అయితే.. మీరే ఇంట్లో అలాంటి ఓ టేస్టీ అండ్ హెల్తీ ఐస్ క్రీం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది అల్లనేరేడు పండ్ల సీజన్. ఈ బ్లాక్ జామూన్ లో ఎన్నో పోషక విలువలుంటాయి. వీటితో ఐస్ క్రీం తయారు చేస్తే.. పిల్లలు, పెద్దలు పోటీలు పడి మరీ ఖాళీ చేస్తేస్తారు.
కేవలం 15 నిమిషాల్లో తయారైపోతుంది. హెల్తీ కూడా. పార్టీలు, గెట్ టు గెదర్ లకు అప్పటికప్పుడు చేయడానికి చాలా బాగుంటుంద.
అల్లనేరేడు పండ్ల ఐస్ క్రీం తయారీకి కావాల్సిన పదార్థాలు2 కప్పుల అల్లనేరేడు పండ్లు12 కప్పు కండెన్సెడ్ పాలు6 పుదీనా ఆకులు1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి12 కప్పు ఫ్రెష్ క్రీమ్12 కప్పు చక్కెర2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలు
అల్లనేరేడు పండ్ల ఐస్ క్రీం తయారు చేసే విధానం..ముందుగా అల్లనేరేడు పండ్లలోని గింజల్ని తీసేసి.. దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన జామూన్ ప్యూరీని పక్కన పెట్టుకోవాలి.
ఓ మందపాటి గిన్నెలో తాజా క్రీమ్, కండెన్సెడ్ మిల్క్, చక్కెర పోసి బాగా కలపాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండిని, గోరువెచ్చని పాలలో వేసి ఉండలు లేకుండా కలపాలి. ఆ తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న క్రీమ్, మిల్క్ మిశ్రమానికి దీన్ని కలపండి.
తరువాత ఈ గిన్నెను స్టౌ మీద పెట్టి, మీడియం మంట మీద పెట్టి ముద్దలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడేవరకు ఇలా కలపాలి.
చిక్కగా అయ్యాక స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. తరువాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో పోసి, ఫ్రిజ్ లో పెట్టాలి. రెండు గంటలపాటు డీప్ లో ఉంచాలి.
అంతే టేస్టీ టేస్టీ అల్లనేరేడు ఐస్ క్రీం రెడీ. దీన్ని తీసి ఐస్ క్రీం సర్వింగ్ బౌల్స్ లో వేసి.. పైన పుదీనా ఆకులతో అలంకరించి సర్వ చేయడమే.