anemia
మన శరీరంలో ఇనుము ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది మన శక్తి స్థాయిని, రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది హిమోగ్లోబిన్ తయారీకి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాలు రక్త నాళాల ద్వారా ఆక్సిజన్ ను తీసుకువెళ్లడానికి సహాయపడే ప్రోటీన్ కాబట్టి హిమోగ్లోబిన్ మన శరీరానికి చాలా చాలా అవసరం. శరీరంలో ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కాకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ఇవి రక్తాన్ని పెంచుతాయి. మరి ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
grain shortage
ధాన్యాలు
ధాన్యాలు ఇనుముకు మంచి వనరులు. 100 గ్రాముల ఓట్ మీల్ లో 4.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. గోధుమల్లో 100 గ్రాముల్లో 3.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. తృణధాన్యాలలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. తృణధాన్యాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్, ఊబకాయం, క్యాన్సర్ మొదలైన ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Image: Freepik
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ కూడా శరీరంలో ఐరన్ కంటెంట్ ను పెంచుతుంది. 100 గ్రాముల డార్క్ చాక్లెట్ లో 6.32 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. భోజనం తర్వాత కొద్దిగా డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల శరీరంలో ఐరన్ పరిమాణం పెరుగుతుంది. అయితే ఇందులో కేలరీలు కూడా ఉంటాయి. కాబట్టి అతిగా తినకండి. డార్క్ చాక్లెట్ లో మంచి కొవ్వులు, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం మొదలైనవి ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
చిక్కుళ్లు
వేరుశెనగ, కాయధాన్యాలు, పెసరపప్పు, సోయాబీన్స్ తో పాటుగా రకాల బీన్స్ వంటి చిక్కుళ్లు ఇనుముకు మంచి వనరులు. బీన్స్ లో 100 గ్రాములలో 5 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. వేరుశెనగలో 1.5 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. 100 గ్రాముల కాయధాన్యాల్లో 6.2 మి.గ్రాముల ఐరన్ ఉంటుంది. చిక్కుళ్లలో ప్రోటీన్, ఫైబర్, బి-కాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియం, పొటాషియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. చిక్కుళ్లను తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక రక్తపోటు, మంట వంటి సమస్యలకు దూరంగా ఉంటారు.
Image: Getty
విత్తనాలు
నువ్వులు, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల గుమ్మడికాయలో 3.3 మిల్లీగ్రాముల ఐరన్, నువ్వుల్లో 14.6 మిల్లీగ్రాములు, అవిసె గింజల్లో 5.6 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ విత్తనాల్లో కేలరీలు, మంచి కొవ్వులు, విటమిన్ ఎ, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, వివిధ ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి.
గింజలు
పిస్తా, జీడిపప్పు, బాదం వంటి గింజలు ఇనుముకు మంచి వనరులు. 100 గ్రాముల పిస్తాపప్పులో 3.9 మిల్లీగ్రాముల ఐరన్, జీడిపప్పులో 6.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. 100 గ్రాముల బాదం పప్పులో 5.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. గింజల్లో ప్రోటీన్లు, మంచి కొవ్వులతో పాటుగా ఇతర విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇవి సహాయపడతాయి.
Image: Getty
పండ్లు
ఎండుద్రాక్ష, అంజీర పండ్లు వంటి ఎండిన పండ్లు కూడా ఇనుముకు మంచి వనరులు. 100 గ్రాముల ఎండు ద్రాక్షలో 0.93 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. 100 గ్రాముల ఎండిన అంజీర పండులో6.3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ ను రోజూ తీసుకోవడం వల్ల ఐరన్ లోపం పోతుంది. ఎండు ద్రాక్ష జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఎండుద్రాక్ష ఎముకలను బలోపేతం చేయడానికి కూడా బాగా సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే అంజీర పండ్లు కళ్లు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.