రాత్రిళ్లు ఎంతకీ నిద్రపట్టడం లేదా? వీటిని గనుక తాగితే మీరు ప్రశాంతంగా పడుకోవడం పక్కా..!

First Published | Aug 12, 2023, 9:50 AM IST

ఇలా బెడ్ పై వాలిన వెంటనే అలా నిద్రలోకి జారుకునేవారు చాలా మందే  ఉన్నారు. ఇలాంటి వాళ్లు చాలా లక్కీ అని కొందరంటుంటారు. ఎందుకంటే కొంతమందికి ఏం చేసినా రాత్రిళ్లు నిద్రరానేరాదు. అటూ ఇటూ దొర్లి దొర్లి ఏ 3 గంటలకో పడుకుంటుంటారు. 

sleep

ప్రస్తుత కాలంలో నిద్రలేమితో బాధపడేవారు ఎక్కువయ్యారు. కానీ ఈ నిద్రలేమి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. కంటి నిండా నిద్రలేకపోవడం వల్ల బాగా అలసటగా ఉంటుంది. బద్దకంగా అనిపిస్తుంది. ఒంట్లో శక్తిలేనట్టుగా ఉంటుంది. అంతేకాదు ఈ నిద్రలేమి కాలక్రమేణా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వ్యక్తైనా సరే రోజుకు 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలంటారు నిపుణులు. అయితే కొన్ని ఇంట్లో తయారుచేసిన డ్రింక్స్ మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


పసుపుతో గోరువెచ్చని పాలు

రాత్రి నిద్రపోవడానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పసుపు కలిపిన పాలను తాగడం వల్ల మీకు హాయిగా నిద్రపడుతుంది. ఇది నిద్రలేమిని పోగొట్టడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకు కారణం దీనిలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉండటం. ఇది పాలలో ఉండే అమైనో ఆమ్లం. దీన్ని పసుపుతో కలిపినప్పుడు మీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. అంతేకాదు పసుపులో ఉండే శోథ నిరోధక లక్షణాలు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. 

ఎలా తయారుచేయాలంటే: ఒక కప్పు పాలను వేడి చేసి అందులో చిటికెడు పసుపును కలపండి.మీరు కావాలనుకుంటే ఈ పాలలో తేనెను వేసి కూడా తాగొచ్చు. 
 



అశ్వగంధ టీ

అశ్వగంధలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఇది ఒత్తిడి, యాంగ్జైటీ, నిస్పృహ లక్షణాలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పాలకు అశ్వగంధ పౌడర్ ను  కలిపి తీసుకుంటే మీకు ఎలాంటి డిస్ట్రబ్ లేకుండా నిద్రపడుతుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్, అశ్వగంధ లో ఉండే అడాప్టోజెనిక్ లక్షణాల కలయికే నిద్రను  మెరుగుపరుస్తుంది. ఇది నిద్రలేమి సమస్యను పోగొడుతుంది. 

ఎలా తయారుచేయాలంటే: అశ్వగంధ వేరు లేదా పొడిని గోరువెచ్చని పాలలో 10 నిమిషాల పాటు ఉండనివ్వండి. దీన్ని వడకట్టి పడుకునే ముందు తాగండి.
 

కుంకుమపువ్వు, బాదం పాలు

కుంకుమ పువ్వు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఎన్నో ఔషదగుణాలున్నహెర్బ్. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎన్నో శారీరక సమస్యలను కూడా నయం చేస్తుంది. ఈ పువ్వు ఒత్తిడిని తగ్గించి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. రాత్రిళ్లు హాయిగా పడుకోవడానికి బాదం పాలు, కుంకుమపువ్వు తంతువుల మిశ్రమాన్ని తయారుచేసి తాగొచ్చు. వీటిలో ఉండే మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ మీరు ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా నిద్రపోవడానికి సహాయపడతతాయి. ఇది నిద్రలేమిని పరిష్కరించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

ఎలా తయారుచేయాలంటే:  గోరువెచ్చని పాలలో కొన్ని కుంకుమపువ్వులను వేసి నానబెట్టాలి. ఇక బాదం పాలను తయారు చేయడానికి బాదంలను నీటిలో నానబెట్టి మిక్సీ పట్టండి. ఆ తర్వాత కుంకుమపువ్వు  కలిపిన పాలతో వీటిని కలపండి. కావాలనుకుంటే దీనికి కొంచెం తేనెను కూడా యాడ్ చేయొచ్చు. 
 

Image: Freepik


జాస్మిన్ గ్రీన్ టీ

జాస్మిన్ గ్రీన్ టీ కూడా మీరు హాయిగా, ఎలాంటి సిస్ట్రబెన్స్ లేకుండా పడుకోవడానికి బాగా సహాయడపుతుంది ఇది నిద్రలేమిని నివారించడానికి కూడా బాగా సహాయపడుతుంది. దీనిలో ఒత్తిడిని తగ్గించే, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచే లక్షణాలు ఉంటాయి. ఈ టీలో థియనిన్ అని పిలువబడే సమ్మేళనం మీరు తొందరగా పడుకోవడానికి సహాయపడుతుంది. ఇది అమైనో ఆమ్లం. ఇది నిద్రను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.

ఎలా తయారుచేయాలంటే: ప్యాకేజీ సూచనల ప్రకారం.. మల్లె గ్రీన్ టీని తయారు చేయండి. సాయంత్రం పూట తాగండి. అయితే దీనిలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.  కాబట్టి దీన్ని నిద్రపోవడానికి ముందుగా తాగకూడదు. 
 

తులసితో హెర్బల్ స్పైస్డ్ టీ

తులసిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది దగ్గు, జలుబు, ఫ్లూ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఇది కూడా నిద్రను ప్రేరేపిస్తుందన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోనివారికి, నిద్రలేమితో బాధపడుతున్నవారికి తులసి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే అడాప్టోజెనిక్, ఒత్తిడిని తగ్గించే లక్షణాలు దీనికి కారణం. ఈ టీకి యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలను కూడా చేర్చొచ్చు. ఇవి టీ రుచిని పెంచుతాయి. అలాగే మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. 

ఎలా తయారుచేయాలంటే: బ్లాక్ టీ, పాలు, మసాలా దినుసులతో ఒక కప్పు మసాలా టీని తయారు చేయండి. అదనపు ప్రయోజనాల కోసం ఇది మరుగుతున్నప్పుడు కొన్ని తులసి ఆకులను వేయండి. 

Latest Videos

click me!