పొద్దు తిరుగుడు గింజల పోషకాలు
ఈ పొద్దు తిరుగుడు గింజల్లో ఒకటి కాదు రెండు ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ గింజల్లో విటమిన్ బి 6, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, కాల్షియం, రాగి, ఇనుము, ఫైబర్, జింక్, భాస్వరంతో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పొద్దు తిరుగుడు గింజల్ని తినడం వల్ల మన శరీరానికి ఈ పోషకాలన్నీ అందుతాయి. దీంతో మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం.
ఎముక ఆరోగ్యం
ఈ రోజుల్లో చాలా మంది బలహీనమైన ఎముకలు, బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విత్తనాల్లో ఉండే విటమిన్ డి, కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతాయి. అలాగే ఎముకల ఎదుగుదలకు సహాయపడతాయి.